Monday, May 6, 2024
- Advertisement -

షూటింగ్‌లో గోవా బ్యూటీ ఇలియానకు గాయం!

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో దేవదాసు చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది గోవా బ్యూటీ ఇలియానా. అతి తక్కువ కాలంలో స్టార్ హీరోల సరసన నటించి నెంబర్ వన్ హీరోయిన్ గా వెలిగిపోయింది. తెలుగు లో మంచి ఫామ్ లో ఉండగానే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అక్కడ సత్తా చాటాలని ప్రయత్ని ఫెయిల్ అయ్యింది. ప్రస్తుతం టాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. హీరోయిన్ ఇలియానా ప్ర‌స్తుతం  బ‌ల్వీంద‌ర్ సింగ్ జ‌నుజ ద‌ర్శ‌క‌త్వంలో ర‌ణ్‌దీప్ హుడాతో కలిసి ‘అన్‌ఫెయిర్ అండ్ ల‌వ్‌లీ’ సినిమాలో న‌టిస్తోంది.

అయితే, ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలో ఇలియానా స్వల్పంగా గాయ‌ప‌డింది. బ‌ల్వీంద‌ర్ సింగ్ జ‌నుజ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం హర్యానా నేపథ్యానికి వ్యతిరేకంగా  ఉన్న క‌థ‌తో రూపొందుతుంది. తన చేతికి గాయం అయ్యిందని.. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఫోటోను షేర్ చేసింది. ఆమె కుడి అరచేతిపై స్వల్పంగా రక్తం కనపడింది.

దీంతో అభిమానులు కంగారు పడ్డారు. ఏం జరిగిందని కామెంట్లు చేశారు. రొమాంటిక్ కామెడీ కోసం షూటింగ్ చేస్తున్నప్పుడు ఎవరు గాయపడతారు అని ఫ‌న్నీ జిఫ్ ఫొటో పెట్టింది. అలియానా గాయాన్ని చూసి ఆందోళ‌న‌కు గురైన అభిమానులు ఆమెకు క్షేమ స‌మాచారాలు తెలియ‌జేస్తున్నారు.

రాధే శ్యామ్ లో ఇంకో హీరోయిన్ ఉందా…?

లూసిఫర్ రీమేక్ విషయంలో వినాయక్ కి చిరు పెద్ద షాక్..?

మహేష్ తో త్రివిక్రమ్ ఆల్మోస్ట్ ఓకే చేసినట్టే..?

పూరీ తో ఆ రీమేక్ సినిమా పవన్ కళ్యాణ్ చేసేనా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -