Tuesday, April 30, 2024
- Advertisement -

పూరీ తో ఆ రీమేక్ సినిమా పవన్ కళ్యాణ్ చేసేనా..?

- Advertisement -

పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లో అభిమానులను ఉంచాడు.. ఇప్పటికే మూడు సినిమా లు ఓకే చేసిన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లోపు వీలైనన్ని సినిమాలు చేసి రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.. అయితే ఒకేసారి మూడు సినిమాలను అనౌన్సు చేసి అయన అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చినా ఆ తర్వాత సినిమాలు చేస్తాడో లేదో అని కొంత అనుమానం తో పాటు అసహనం కూడా వారిలో రోజు రోజు కి ఎక్కువవుతుంది.. ఈ సినిమాలు పూర్తి చేసే సరికి ఎన్నికల సమయం దగ్గరపడుతుంది.. అప్పుడు ప్రచారం పనిలో పవన్ కళ్యాణ్ వెళ్తే ఇక సినిమాలకు స్వస్తి చెప్పేలా ఉన్నాడని అభిమానులు వాపోతున్నారు.. నిజానికి ఈ ఎన్నికల్లో పవన్ గెలిచి ఉంటే అయన దాదాపు సినిమాలు చేయకపోయి ఉండేవారు కనీ దేవుడి దయవల్ల అయన ఎన్నికల్లో ఓడిపోవడంతో మళ్ళీ ఆయనను వెండి తెరపై చూడాలన్న కోరిక నెరవేరుతుంది అని ఫాన్స్ అంటున్నారు.. ఏదేమైనా అయన రాజకీయాల్లో కంటే సినిమాల్లో నే ఉండాలనుకునేవారు ఎక్కువగా ఉన్నారు..

ఇక మూడు సినిమాల్లో ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమా  మొదటగా రిలీజ్ అవుతుంది..  పవన్ కళ్యాణ్ ఈ సినిమా ని వీలైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమా కి ఇది రీమేక్ కాగ పవన్ హీరోయిజానికి తగ్గట్లు స్క్రిప్ట్ లో మార్పులు చేసి ఈ సినిమా ని రూపొందిస్తున్నారు.. తొలిసారి పవన్ సినిమా కి సంగీతం వహిస్తున్నారు తమన్. ఇక ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో సోసియో ఫాంటసీ సినిమా చేస్తున్నారు పవన్ కళ్యాణ్.. ఇందులో బందిపోటు గా కనిపించబోతున్నారని తెలుస్తుంది..

ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. ఇక గబ్బర్ సింగ్ కాంబో వస్తున్న వస్తున్న పవన్ కళ్యాణ్ మూడో సినిమా పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.. ఈ సినిమా కి హరీష్ శంకర్ దర్శకత్వం హైలైట్ అని తెలుస్తుంది. ఈ మూడు సినిమాలు కాకుండా పవన్ కళ్యాణ్ మరో సినిమా ని కూడా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అది కూడా ఓ మల్టీ స్టారర్ సినిమా అని తెలుస్తుంది.. అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ కు పవన్ దాదాపు పచ్చ జెండా ఊపేసినట్లే. ఇక రానా సైడ్ నుంచి ఓకె కావాలి. అన్నింటికి మించి ఈ ప్రాజెక్టుకు సరైన డైరక్టర్ కావాలి. పూరి జగన్నాధ్, హరీష్ శంకర్ లాంటి వాళ్లు కావాలి. కానీ ఎవ్వరూ దరిదాపుల్లో ఖాళీగా లేరు.  అదే వెదుకులాట సాగుతోంది. అది ఒక్కటి సెట్ అయిపోతే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేస్తుంది. మరి ఈ సినిమా కి ఎవరు దర్శకత్వం వహిస్తారో చూడాలి..

అనుష్క తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే నా..?

పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

పవన్ కళ్యాణ్ కేజిఎఫ్ తో తట్టుకుని నిలబడ గలడా..?

OTT లకు సంక్షోభం.. అన్ని ఫ్లాప్ సినిమాలే…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -