Saturday, May 11, 2024
- Advertisement -

నేటి నుంచి రాష్ట్రమంతా… రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ.

- Advertisement -

ఇప్పటికే రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో అమలలో ఉన్న ఆస్పత్రిలో వెయ్యి రూపాయల బిల్లు దాటితే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య చికిత్స. నేటి నుంచి శ్రీకాకుళం, తూర్పు గోదావరి, కృష్ణా, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ప‌్ర‌జ‌ల గుండె చ‌ప్పుడు తెలిసిన ప్ర‌భుత్వం మాద‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. 24*7 గ్రామాల్లో కూడా వైద్యం అందుబాటులోకి తీసుకువ‌స్తున్నామ‌ని, పేద‌వాడు వైద్యానికి ఇబ్బంది ప‌డే రోజులు ఇక ఉండ‌వ‌ని సీఎం వెల్ల‌డించారు. నేటి నుంచి మిగిలిన ఆరు జిల్లాల్లతో పాటు ఈ పథకం​ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానుంది.

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఆయా జిల్లాల కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ ద్వార ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీని వర్తింప చేస్తామని ముఖ్యమంత్రి జగన్ గత ఎన్నిక‌ల సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ ఏడాది జనవరి 3న పశ్చిమ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టారు. జూలై 16న నుంచి కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఈ పథకం ప్రారంభమైంది.

ఇందులో ఇప్పటి వరకు 2,200 వ్యాధులకు వర్తిస్తున్న ఆరోగ్యశ్రీ పథకంలోకి మరో 234 వ్యాధులను చేర్చారు. దీంతో మొత్తం 2,434 వ్యాధులు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తాయి. ఆస్పత్రి బిల్లు వెయ్యి రూపాయలు దాటితే బిల్లు మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది.

విద్యార్థులకు జగన్ సర్కార్ భారీ ఊరట

వైద్య ఆరోగ్య శాఖలో అవినీతిపై జగన్ కన్నెర్ర

వైఎస్సార్ ని మించి పోయిన జగన్.. పాలన భేష్..?

మరో భారీ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన జగన్..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -