Monday, April 29, 2024
- Advertisement -

సమంత ‘సామ్ జామ్’ షోలో విజయ్ దేవరకొండ సందడి!

- Advertisement -

ఇప్పుడు టాలీవుడ్ సెలబ్రెటీలు వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా తమ సత్తా చాటుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, నాని, రానా లాంటి వారు పలు రియాల్టీ షోల్లో పాల్గొంటున్నారు. తాజాగా బిజీ బిజీగా ఉన్న సమంత కూడా బుల్లితెరపై సందడి చేయబోతుంది. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 4 లో తన సత్తా చాటింది. ఒక్కసారి హూస్ట్ గా వచ్చినప్పటికీ సమంతో జోష్ ఏంటో చూపించింది. ప్రస్తుతం ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం హోస్ట్ అవతారం ఎత్తిన సమంత  ‘సామ్ జామ్’ అనే షోను రూపొందిస్తోన్న విషయం తెలిసిందే.

ఈ షోలో టాలీవుడ్ సెలబ్రెటీలతో తనదైన స్టైల్లో ఇంటర్వ్యూ తీసుకోబోతుంది సమంత. గతంలో ఇలాంటి షోలు వచ్చినా.. అక్కినేని సమంత షో ఒక ప్రత్యేకత అంటున్నారు. ఇప్పటికే ఈ షో షూటింగ్ ప్రారంభం కాగా, టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఈ షోకు హాజరయ్యాడు.

‘సామ్ జామ్’ షో పోస్టర్ వద్ద సిల్వర్ కలర్ సూట్‌తో విజయ్ ఫొటోలు తీసుకున్న ఫొటో బయటకు వచ్చింది. ఈ నెల 13వ తేదీ నుంచి ఈ షో ప్రసారం కానుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శక్వంలో ‘ఫైటర్’ చిత్రం లో నటిస్తున్నారు.

విపరితమైన నష్టాలు మిగిల్చిన సినిమాలు ఇవే..!

సుడిగాలి సుధీర్ ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా ?

రష్మీకతో అఖిల్.. బొమ్మ హిట్ ఫక్కా..!

మహేష్ బాబుకు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -