Sunday, May 5, 2024
- Advertisement -

జనతా గ్యారేజ్ సెన్సార్ రివ్యూ!

- Advertisement -

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జనతా గ్యారేజ్. ఎన్టీఆర్ సరసన ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఈ చిత్రంలో కాజల్ ఐటం సాంగ్ చేస్తోంది. మొదటి నుంచి ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టైటిల్, సాంగ్స్ వచ్చినప్పటి నుంచి ఈ చిత్రంపై మరింత అంచనాలు పెరిగిపోయాయి.

అయితే ఈ చిత్రంకు సంబంధించి సెన్సార్ రివ్యూ బయటకు వచ్చింది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ అందించింది. సినిమా రన్ టైమ్ మొత్తం 2 గంటల 40 నిముషాలు ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాని చూసిన సెన్సార్ సభ్యులు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఈ చిత్రం ఖచ్చితంగా ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగేస్ట్ హిట్ సినిమాగా నిలుస్తోంది అని అన్నారు. ఎన్టీఆర్ నటన, సమంత, నిత్యామీనన్ ల నటన ఈ చిత్రాన్నికే హైలేట్ అని చెప్పారు. ఇక మోహన్ లాల్ చేసిన పాత్ర ఈ సినిమాకి మరో హైలేట్ అంట.

దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం బాగుంది అని అలాగే బ్యాక్‌గ్రాండ్ మ్యూజిక్ కూడా బాగుందని అన్నారు. కాజల్ చేసిన ఐటం సాంగ్ మరో హైలేట్ అంట. మొత్తానికి టెంపర్, నాన్నకు ప్రేమతో వంటి రెండు సినిమాలతో హిట్స్ అందుకున్న ఎన్టీఆర్ కు కొరటాల శివ మరో హిట్ ఇచ్చాడు. దీంతో ఎన్టీఆర్ లీస్ట్ లో మరో హిట్ పడినట్లు తెలుస్తోంది. అలాగే దర్శకుడు కొరటాల శివ లీస్ట్ లో వరసగా రెండు హిట్స్ తర్వాత జనతా గ్యారేజ్ రూపంలో మూడో హిట్ అందుకున్నట్లు తెలుస్తోంది. మరి సెన్సార్ రివ్యూ అయితే ఇలా ఉంది అసలు రివ్యూ తెలుసుకోవాలి అంటే మాత్రం సెప్టెంబర్ 1 వరకు ఆగాల్సిందే.

{YOUTUBE}PCPX5qDDPjw{/YOUTUBE}

Related

  1. జనతా గ్యారేజ్ స్టోరీ ఇదేనా?
  2. జనతా గ్యారేజ్ లో సాంగ్స్ కాపీ కొట్టిన దేవిశ్రీ!
  3. జనతా గ్యారేజ్ ఆడియోకి సమంత ఎందుకు రాలేదంటే?
  4. జనతా గ్యారేజ్ లో రెండు క్లైమాక్స్ లు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -