Thursday, May 2, 2024
- Advertisement -

అవి చెబితే రాజమౌళి చంపేస్తాడు.. ఎన్టీఆర్ కామెంట్స్!

- Advertisement -

తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి వంశం నుంచి హీరోగా పరిచయం అయిన జూనియర్ ఎన్టీఆర్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని, ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మల్టీ స్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ లో అద్భుతమైన పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీపై తెలుగు ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఎన్టీఆర్ తాను ఇటీవలే కరోనా బారిన పడి సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన సంగతి తెలిసిందే.తాజాగా క్వారంటైన్‌లో ఉన్న ఎన్టీఆర్‌ను ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూ చేయగా తాను బాగానే ఉన్నానని అభిమానులు ఆందోళన చెందనవసరం లేదని చెప్పుకొచ్చారు. అలాగే ఆర్ఆర్ఆర్ మూవీ కథ గురించి చెప్పమని అడిగితే ఎన్టీఆర్ సరదాగా నవ్వుతూ.. నేను కథ గురించి చెబితే రాజమౌళి నా వెనక గొడ్డలి పట్టుకుని పరుగెడుతాడు అంటూ సినిమాకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండా మాట దాటవేశారు.

Also read:తండ్రి మరణ రహస్యం గురించి చెప్పిన సురేఖా వాణి కూతురు?

అయితే తాను నెక్స్ట్ చేయబోయే మూవీస్ గురించి క్లారిటీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్
30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నారు. కొరటాల ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడని చెప్పారు.తదుపరి 31వ సినిమాను ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్నట్టు చెప్పుకొచ్చాడు. మరోవైపు కరోనా కేసులు తగ్గి సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాతే ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని రాజమౌళి ఆలోచనలో ఉన్నాడట.

Also read:వామ్మో.. అల్లరి నరేష్ సినిమాలో దారుణమైన బూతులు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -