Sunday, April 28, 2024
- Advertisement -

తక్కువ పోస్టులతోనే అత్యధిక రికార్డు సాధించిన తారక్?

- Advertisement -

ఎన్టీఆర్ నట వారసునిగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును పొందాడు.ప్రస్తుతం జూనియర్ఎన్టీఆర్ తెలుగు ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతూ తెలుగు ప్రేక్షకుల విశేష ఆదరణను పొందుతున్నాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగులో ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న “ఆర్ఆర్ఆర్”మూవీలో లో గిరిజన వీరుడు కొమురం భీమ్‌ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన సత్తా చాటుకున్నాడు. అప్పుడప్పుడు మాత్రమే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే తారక్ తాజాగా తన ట్విటర్‌ ఖాతాలో 5 మిలియన్ ఫాలోవర్ల మార్కును చేరుకున్నాడు.50 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న అతి కొద్ది మంది టాలీవుడ్ స్టార్స్‌లో ఒకరిగా నిలవడంతో నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో #5MFollowersForNTR అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈనెల 28న నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కు ఆ ఒక్కరోజే దాదాపు రెండువేల మంది ఫాలోవర్స్ వచ్చారంటే ఎన్టీఆర్ ఉన్న స్టామినా ఏంటో అర్థం అవుతోంది.

Also read:నటుడు సోనుసూద్ కి నోటీసులు జారీ చేసిన ముంబై హైకోర్టు?

జూనియర్ ఎన్టీఆర్ “ఆర్ఆర్ఆర్”మూవీ తర్వాత తన 30వ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నారు. తర్వాత 31వ సినిమాను కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్నట్టు తెలుస్తోంది.

Also read:ఏకంగా తనని టైటానిక్ హీరోయిన్ తో పోల్చుకున్న యంగ్ హీరో .. ఫోటో వైరల్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -