చిరుకు అదిరిపోయే షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్!

power star given the shock to mega star

చాలా రోజులుగా మెగా ఫ్యామిలీలో మెగా బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య విబేధాల గురించి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఓ నెపథ్యంలో కొంత కాలంగా పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ హీరోలకి సంబంధించి ఏ ఫంక్ష‌న్ల‌కు హాజర్ కావడం లేదు. ఈ క్రమంలోనే పవన్ అన్న చిరంజీవి కేరీర్ లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన చిత్రం నెంబ‌ర్ 150వ చిత్ర ఆడియో వేడుకకు పవన్ తప్పకుండా హాజ‌ర‌వుతార‌ని అందరూ అనుకున్నారు.

దాదాపు పదేళ్ల త‌ర్వాత చిరు నటిస్తున్న సినిమా కావడంతో పాటు చిరు కేరీర్‌లో ల్యాండ్ మార్క్ సినిమాగా తెరకెక్కుతుండటంతో ఈ చిత్ర ఆడియో వేడుకకు పవన్ రావడం పక్కా అని భావించారు. అయితే పవన్ తన అన్న చిరంజీవి కి మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. పవన్ ప్రస్తుతం కాటమరాయుడు సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ కోసం పవన్ పొల్లాచ్చి బయలు దేరుతున్నాడు.  10న కేర‌ళ వెళుతోన్న ప‌వ‌న్ తిరిగి ఈ నెల 26న హైద‌రాబాద్‌కు రానున్నాడు. దీన్ని బ‌ట్టి చూస్తే అన్న‌య్య చిరంజీవి ఆడియో ఫంక్ష‌న్ డుమ్మా కొట్ట‌డానికి త‌మ్ముడు ప‌వ‌న్ ప‌క్కాగా ప్లానింగ్ వేసుకొన్న‌ట్టే అర్థ‌మ‌వుతోంది. ప‌వ‌న్ మ‌రోసారి త‌న అన్న‌కు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చే క్ర‌మంలోనే ఈ ప్లాన్ వేసిన‌ట్టు ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Related

  1. పవన్ కొత్త సంవత్సరం ప్లాన్ ఇదే!
  2. పవన్ అభిమానులపై ఫైర్ అయిన ఝాన్సీ
  3. పవన్.. పవర్ స్టార్ కావడానికి కారణం ఎవరు?
  4. పవన్ కళ్యాణ్ తొందర పడకు .. తరవాత బాధపడతావ్