Monday, May 20, 2024
- Advertisement -

‘వంగవీటి’ మూవీ రివ్యూ

- Advertisement -
vangaveeti movie review

రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన కొత్త సినిమా వంగవీటి. చాలా రోజుల తర్వాత ఈ సినిమా ఎక్కువ ప్రమోట్ చేసారు వర్మ. దాంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా.. ఈ సినిమా కథ విజయవాడ కి సంబంధించిన రెండు వర్గాల ప్రజలది. ఈ కథ ని వర్మ ఎలా ప్రెసెంట్ చేస్తాడో అని అందరిలో ఆసక్తి నెలకొంది. మరి ఈ రోజు రిలీజ్ అయిన ఈ వంగవీటి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

వంగవీటి సినిమా కథ విజయవాడ ప్రజలకే కాక రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా తెలిసిన కథ. రెండు వర్గాల మద్య ఆదిపత్య పోరాటం. కమ్మ వర్గానికి చెందిన చలసాని వెంకటరత్నం హత్య తో సినిమా మొదలయి వంగవీటి రంగా హత్యతో సినిమా ముగుస్తుంది. ఈ మద్య కథలో వంగవీటి రాధ, వంగవీటి మోహన రంగా ,దేవినేని నెహ్రు, దేవినేని గాంధీ, దేవినేని మురళి , రత్న కుమారి గురించిన కథ నడుస్తుంది.

విశ్లేషణ :

రామ్ గోపాల్ వర్మ తనకు బాగా తెలిసిన కథను రెండు వర్గాలకి ఆమోదయోగ్యoగా తీయడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. సినిమా లో కమ్మ, కాపు వర్గాలకి మద్య ఆధిపత్యపోరు రావడానికి పరిస్థితులు ఎలా ప్రబావితం చేసాయో కళ్ళకి కట్టిన్జట్టు చెప్పాడు వర్మ. వర్మ తనదైన స్టైల్ టేకింగ్ తో సినిమా కి ప్రాణం పోసాడు.సినిమా లో దేవినేని మురళి ని చంపే సీన్ అయితే సూపర్బ్. ఈ సీన్ లో అందరితో కంట తడి పెట్టిస్తాడు వర్మ. ఇంక చెప్పుకోవాల్సింది సినిమా లో నటించిన నటి నటుల గురించి. ఒకొక్కరు తమ పాత్రలకి ప్రాణం పోశారు. సినిమాలో మనం నటినటులను చూడం. సినిమా క్యారెక్టర్స్ ని చూస్తాం. మరి ముక్యంగా వంగవీటి రాధ ,రంగా పాత్రను పోషించిన శ్రితేజ్ , దేవినేని మురళి పాత్రను పోషించిన వంశీ లు ఆ క్యారెక్టర్స్ లో జీవించారు. సినిమా కి పాటలు మరియు నేపధ్య సంగీతం పెద్ద ప్లస్.

ప్లస్ పాయింట్స్ :

నటీనటుల అద్భుత నటన

సెంటిమెంట్ సన్నివేశాలు

స్క్రీన్ ప్లే

దర్శకత్వం

పాటలు మరియు నేపధ్య సంగీతం

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

కొన్ని చోట్ల సినిమా స్లో చేసే సన్నివేశాలు

డైలాగ్స్

మొత్తంగా : వర్మ సినిమాలను ఇష్టపడే వారికి ఖచ్చితంగా ఈ వంగవీటి నచ్చుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -