Saturday, April 20, 2024
- Advertisement -

కళ్యాణ్​రామ్​ తాడోపేడో తేల్చుకుందామనుకున్నాడా?

- Advertisement -

ఎన్ని ప్రయోగాలు చేసినా.. కల్యాణ్​రామ్​కు ఆశించిన స్థాయిలో హిట్​లు దొరకడం లేదు. వెరసి అతడికి మార్కెట్​ కూడా పెరగడం లేదు. తన మొత్తం సినీ జీవితంలో అతనొక్కడే, పటాస్​ మినహా.. కమర్షియల్​ గా సక్సెస్​ అయిన మూవీలు తక్కువే. లక్ష్మీకల్యాణం, ఇజం, ఓం వంటి చిత్రాలు కమర్షియల్​గా సక్సెస్​ కాలేకపోయినా.. అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.అయితే కల్యాణ్​రామ్​ కమర్షియల్​ హిట్​ కోసం తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. నటన పరంగా కొంత మెరుగవుతున్నప్పటికీ.. లక్​ కలిసి రావడం లేదంటుంటారు సినీ విశ్లేషకులు. ఇదిలా ఉంటే కల్యాణ్​ రామ్​ ఈ సారి మరో సాహసం చేయబోతున్నాడు. ఓ భారీ బడ్జెట్​ చిత్రంలో నటిస్తున్నాడు.

Also Read: ‘లవ్​స్టోరీ’ రిలీజ్​ ఎప్పుడంటే?

ఎన్టీఆర్​ ఆర్ట్స్’ బ్యానర్ పై కల్యాణ్​రామ్​ బింబిసార అనే ఓ చిత్రంలో నటిస్తున్నాడు. మల్లిడి వశిస్ట్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కల్యాణ్​రామ్ తొలిసారిగా ఓ హిస్టారికల్ మూవీలో నటిస్తున్నాడు. నిజానికి ప్రస్తుతం కల్యాణ్​రామ్​కు పెద్దగా మార్కెట్​ లేదు. కేవలం రూ. 20 కోట్లు మాత్రమే అతడి మార్కెట్​. కానీ బింబిసార పోస్టర్​.. ప్రొడక్షన్​ వ్యాల్యూస్​ చూస్తే మాత్రం .. ఇది భారీ బడ్జెట్​ చిత్రం అని అర్థమవుతున్నది. మరోవైపు ఈ సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కించబోతున్నారట.

కేథరిన్ , సంయుక్త మీనన్ హీరోయిన్లుగా ఎంపికయ్యారు. ఎన్టీఆర్​ పుట్టినరోజునాడు విడుదలైన బింబిసార ఫస్ట్​లుక్​ పోస్టర్​ అభిమానులను అలరించింది. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు చిరంతన్​ భట్​ సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు విజువల్ ఎఫెక్ట్స్​ కూడా ఈ సినిమాలో భారీగా ఉండబోతున్నట్టు సమాచారం. దీంతో బింబిసారతో తాడో పేడో తేల్చుకొనేందుకు కల్యాణ్ రామ్​ ఫిక్స్​ అయ్యాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Also Read: రౌడీ బాయ్ తో గౌతమ్ తిన్ననూరి మూవీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -