Friday, April 19, 2024
- Advertisement -

కరోనా ఎఫెక్ట్ : తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు!

- Advertisement -

తెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ అంశంపై సుధీర్ఘంగా చర్చించిన మంత్రివర్గం.. ప్రస్తుత కరోనా పరిస్థితులను, విద్యార్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పరీక్షల నిర్వహణ మంచిది కాదని అభిప్రాయపడింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఇంటర్ పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే.

పరీక్షలు నిర్వహిస్తే మళ్లీ కరోనా కేసులు విజృంభించే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధులను ప్రమోట్ చేసిన సమయంలో కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని జూన్ మాసంలో సమీక్ష చేసి నిర్ణయం తీసుకొంటామని ప్రకటించింది.

కాగా, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సహా కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలను రద్దు చేసి.. గ్రేడింగ్ విధానంలో ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఫస్ట్‌ ఇయర్‌లో వచ్చిన గ్రేడ్‌ల ప్రకారమే సెకండియర్‌లో గ్రేడింగ్‌ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇక పరీక్షల రద్దు, ఫలితాల విధానంపై సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడనుంది.

ఉద్యోగులకు శుభవార్త.. పీఆర్సీకి కేబినెట్ ఆమోదం

నేటి పంచాంగం,బుధవారం(09-06-2021)

ఇలియానాపై బ్యాన్.. ఆ స్టార్ హీరో సినిమాతో గొడవ గొడవ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -