కేరళలో డ్రగ్స్ కలకలం రేపింది. నార్కోటిక్ పోలీసులు డ్రగ్స్ రైడ్ నిర్వహించగా హోటల్ నుండి మలయాళ నటుడు షైన్ టామ్ చాకో దూకి పారిపోయినట్లు సమాచారం. నటుడు షైన్ టామ్ చాకో కొచ్చిలోని ఓ హోటల్‌లో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారంతో రైడ్స్ చేశారు నార్కోటిక్ పోలీసులు.
పోలీసులు హోటల్‌కు రావడానికి కొద్దిసేపటి ముందే షైన్ టామ్ చాకో పారిపోయినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. మూడో అంతస్తులో ఉన్న రూం కిటికీ నుండి రెండో అంతస్తులోకి దూకి, అక్కడి నుంచి మెట్ల ద్వారా షైన్ టామ్ చాకో పారిపోయినట్లు సమాచారం.
దీనికి ముందు సూత్రవాక్యం అనే సినిమా షూటింగ్ సమయంలో షైన్ టామ్ చాకో డ్రగ్స్ తీసుకొని తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించింది నటి విన్సీ సోనీ అలోషియస్. దీనిపై కేరళ ఫిల్మ్ ఛాంబర్‌తో పాటు అమ్మ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేసిన విన్సీ సోనీ అలోషియస్. డ్రగ్స్ రైడ్… టామ్ చాకో పారిపోయినట్లు వస్తున్న వార్తలు ఒక్కసారిగా కలకలం రేపాయి.