నయన తారతో మూవీ చేయబోతున్నారా ?

- Advertisement -

క్రికెటర్ ఎంఎస్ ధోనీ సినిమా రంగంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. రిటైర్మెంట్ తర్వాత పలు రంగాల్లో ధోనీ పెట్టుబడులు పెడుతున్నాడు. ఇప్పటికే రెస్టారెంట్ బిజినెస్, పౌల్ట్రీ సహా పలు వ్యాపారాల్లోకి అడుగుపెట్టారు. ఇక సినిమాలు కూడా నిర్మించబోతున్నట్లు ధోనీ టీం నుంచి ప్రకటన కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో నయనతారతో సినిమా తీయబోతున్నట్లు ప్రచారం ఊపందుకుంది.

స్టార్ హీరోలతో ఒక పక్క సినిమాలు చేస్తున్న నయన్.. లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తోంది. జూన్ 9 న విఘ్నేష్ శివన్‌ పెళ్లాడబోతున్న నయన తార తాజాగా ఆయన దర్శకత్వంలో విడుదలై కాథు వాక్కుల రెండు కాదల్ తో హిట్ కొట్టింది. ఈ నేపథ్యంలో ధోనీ టీం నయనతో లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తోందంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారానికి ధోనీ టీం చెక్ పెట్టింది. ఇందులో నిజం లేదనీ.. త్వరలో తాను ఓ ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు తెలిసింది.

- Advertisement -

ఇందుకు సంబంధించి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పింది. అసత్యాలు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేసింది. దాంతో నయనతారతో ధోనీ నిర్మాణ సంస్థ మూవీ వట్టి గాసిప్ అని తేలిపోయింది. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ చిత్రంలో నయనతార కీలక పాత్ర పోషిస్తోంది.

మహేశ్ మూవీలో పెళ్లి సందడి బ్యూటీ

మన హీరోలు వాడే కార్లు వాటి ఖరీదు ఎంతంటే ?

సొంత జెట్ ఫ్లయిట్ ఉన్న టాలీవుడ్ స్టార్స్..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -