Tuesday, May 7, 2024
- Advertisement -

“మెగా స్టార్ గారూ నన్ను క్షమించండి”

- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి తో అత్యధిక సినిమాలు చేసిన డైరెక్టర్ గా కోదండరామి రెడ్డి మనందరికీ సుపరిచితులు. డైరెక్టర్ రామి రెడ్డి ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూ లో చిరంజీవి మీద చేసిన సంచలన వ్యాఖ్యలు బాగా కాంట్రవర్సీ అయిన సంగతి తెలిసిందే. కామెడీ – లవ్ – యాక్షన్ సినిమాలు చెయ్యాలి గానీ చిరంజీవి మెసేజ్ ఇస్తే జనాలు నవ్వుతారు అని ఆయన అన్న మాటలకి మెగా ఫాన్స్ హార్ట్ అయ్యారు.

చిరు తో పెద్ద పరిచయం లేని వాళ్ళు అలా అనచ్చు గానీ ఎన్నో సినిమాలు చేసిన ఘనత, చిరు తో ఎప్పుడూ ఉండే చొరవ ఉన్న వ్యక్తి అలా అనడం ఎంటి అంటూ ఆన్స్ చాలా సీరియస్ అయ్యారు. ఈ విషయం తనకి ఇబ్బందిగా మారడం తో వెంటనే రెస్పాండ్ అయ్యారు రెడ్డి. ‘ఆ రోజు నేనేం మాట్లాడానో తర్వాతే ఆ తర్వాత పేపర్లలోను వెబ్ సైట్లలో చూశాకే అర్ధమైంది.

అవన్నీ చూశాక నేను ఇలా మాట్లాడానా అని బాధపడ్డాను. దేవుడి సాక్షిగా చెబుతున్నా.. నాకు తెలియకుండానే ఏదో ఫ్లోలో ఆ రెండు మాటలు అనేశాను. చిరంజీవి గారితో నేను చాలా సినిమాలు చేశా. మా ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఇప్పటికీ ఉంది. ఇబ్బంది పడినవారు అందరూ నన్ను క్షమించాలి.

Related

  1. చిరుతో మెగా హీరోస్ అదిరిపోయే డాన్స్!
  2. మెగా అభిమానులకు పండగా లాంటి వార్త!
  3. బాహుబలి లో మెగా హీరో..!
  4. మెగా అభిమానులు బాధపడిపోతున్నారు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -