Friday, April 19, 2024
- Advertisement -

సొరకాయతో ఎంత అందమో.. ఎలా అంటే?

- Advertisement -

తీగజాతి కాయగూరల్లో సొరకాయకు ప్రత్యేక స్థానం ఉంది.సొరకాయను కొన్ని ప్రాంతంలో అనపకాయగా పిలుస్తారు. సొరకాయలో దాదాపు 96% శాతం వీటిని కలిగి ఉండి అధిక భాగం ఫైబర్ తో నిండి ఉంటుంది. సాధారణంగా సొరకాయను కూరగాను కొన్ని రకాల స్వీట్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు.అయితే సోరకాయను జ్యూస్ చేసుకొని తాగడం వల్ల అద్భుత ప్రయోజనాలు పొందవచ్చు.

సొరకాయలో వ్యాధినిరోధక శక్తిని పెంచే విటమిన్‌ సి, బి, కే, రైబోఫ్లెవిన్‌, జింక్‌, థయామిన్‌, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్‌ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

ఒక కప్పు సొరకాయ జ్యూస్ తో మన శరీరానికి అవసరమైన విటమిన్‌ సి సమృద్ధిగా లభిస్తుంది.
విటమిన్‌ సి మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి అనేక రకాల వ్యాధులకుదూరంగా ఉండవచ్చు.అలాగే మన చర్మసౌందర్యాన్ని సహజసిద్ధంగా మెరుగుపరుస్తుంది.

Also read:రోగనిరోధక శక్తి పెరగాలంటే ఈ జ్యూస్ తాగండి..?

సొరకాయలో ఉన్న ఔషధ గుణాలు క్లోమం పనితీరును మెరుగుపరిచి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి డయాబెటిస్ వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు.అలాగే రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

రోజూ ఉదయాన్నే సొరకాయ జ్యూస్‌ తాగితే శరీరంలోని మలినాలు తొలగి అధిక బరువు సమస్య, జీర్ణ సంబంధిత సమస్యలు, జుట్టు రాలుట వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అదేవిధంగా సొరకాయ గుండ్రంగా కట్ చేసుకుని కళ్లపై పెట్టుకోవడం వల్ల కంటికి ఎంతో ఉపశమనం లభిస్తుంది.

Also read:సోంపు తినండి.. ఆ సమస్యకు చెక్ పెట్టండి!

మన చర్మం మృదువుగా మారడానికి సొరకాయ ఎంతో దోహదపడుతుంది. సొరకాయ జ్యూస్ తాగలేనివారు సొరకాయ గుజ్జు లోకి కొద్దిగా శెనగపిండి, పెరుగు కలుపుకుని పేస్టులా తయారు చేసుకునే మొహానికి ప్యాక్ వేసుకుంటే చర్మం ఎంతో మృదువుగా, కాంతివంతంగా మెరుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -