Thursday, May 2, 2024
- Advertisement -

మెగాస్టార్ ను ఆకాశానికెత్తేసిన మహేష్ బాబు!

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబుకి తెలుగులో ఏ రెంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. అయితే మహేష్ కి మెగాస్టార్ చిరంజీవి థాంక్స్ చెప్పారు. చిరు.. మహేష్ కి ఎందుకు థాంక్స్ చెప్పారు అనుకుంటున్నారా… మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సంద‌ర్భంగా(సోమవారం) నైట్ పార్క్ హ‌య‌త్ హోట‌ల్లో గ్రాండ్ పార్టీ నిర్వహించారు.

ఈ పార్టీకి మెగాస్టార్ ప్యామిలీ సభ్యులతో పాటు, పరిశ్రమకు సంబంధించిన హీరోలు, దర్శకులు, హీరోయిన్స్ హాజరయ్యారు. వీరిలో శ్రీకాంత్, రవితేజ, అఖిల్, రాశీఖన్నా, ప్రగ్య జైస్వాల్ తదితరులున్నారు. పార్టీలు, ఆడియో వేడుకలకు దూరంగా ఉండే సూపర్ స్టార్ మహేష్ బాబు మెగాస్టార్ పార్టీకి వచ్చి సెంట‌ర్ ఆఫ్ ది అట్రాక్ష‌న్ గా నిలిచారు. ఈ పార్టీకి వచ్చిన మహేష్.. చిరు 150 వ సినిమా గురించి మాట్లాడి అందరినీ సంతోష పరిచాడని తెలుస్తోంది.

చిరు ‘ఖైదీ నంబ‌ర్ 150’ సినిమా ఫస్ట్ లుక్ లో మెగాస్టార్ లుక్స్ అదిరిపోయే రెంజ్ లో ఉందని, ఆ ఫస్ట్ లుక్ చూస్తుంటే తనకు ఠాగూర్ గుర్తుకు వచ్చిందని, ఠాగూర్ కంటే కూడా ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందని మహేష్ చెప్పెసరికి అక్కడ ఉన్నవారందరు చప్పట్లు కొట్టారని సమాచారం. మహేష్ బాబు మాటలకు అనందపడిన మెగస్టార్ మహేష్ కి వెంటనే థ్యాంక్స్ చెప్పారని ఈ పార్టీకి హాజరైన వారు చెబుతున్నారు. ఎలాంటి ఈగోలకు పోకుండా నటులను అభినందించడంలో సూపర్ స్టార్ మహేష్ ఎప్పుడు మొదటి వరసలో ఉంటారని ఈ విషయంతో అర్ధం అవుతోంది.

Related

  1. పచ్చబొట్టు పొడిపించుకున్న మహేష్ భార్య
  2. మహేష్ సినిమాలో నమ్రత ఏ రోల్ చేస్తుందటే?
  3. మెగాస్టార్ ‘ఖైదీ నెంబర్ 150’ ఫస్ట్ లుక్
  4. నిన్న మొత్తం చిరు ఎక్కడ ఉన్నాడంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -