Friday, March 29, 2024
- Advertisement -

మహేష్‌ బాబుకు సర్జరీ.. ఏమైంది..?

- Advertisement -

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. కొంతకాలంగా ఆయన మోకాలి నొప్పితో బాధపడుతన్నారు. దీంతో వైద్యుల సలహా మేరకు ఆపరేషన్‌ చేయించుకున్నట్టు సమాచారం. స్పెయిన్‌లో సినిమా షూటింగ్‌లో ఉన్న ఆయన అక్కడే సర్జరీ చేయించుకున్నారు.

ఇటీవల సినిమా షూటింగ్‌లో పాల్గొన్న మహేష్‌ బాబుకు నొప్పి అధికం కావడంతో ఆపరేషన్‌ చేయించుకున్నారు. విశ్రాంతి కోసం స్పెయిన్‌ నుంచి ఆయన దుబాయి వెళ్లనున్నట్టు సమాచారం. కాగా మహేష్‌ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మహేష్‌ బాబు తన తదుపరి చిత్రం రాజమౌళితో నటించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చర్చలు పూర్తయ్యాయి. ప్రస్తుతం రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రమోషన్‌లో బిజీ ఉన్నారు. జనవరి నెల నుంచి వీరి సినిమా ప్రారంభం కానుంది. త్రివిక్రమ్‌తో కూడా మహేష్‌ సినిమా చేయనున్నారు.

షాక్‌లో మెగా ఫాన్స్‌

కరోనా వ్యాక్సిన్‌ వేసుకున్న.. ఒమైక్రాన్‌ సోకుతుందా ?

చైతూ విషయంపై మాట్లాడదలుచుకోలేదు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -