Monday, April 29, 2024
- Advertisement -

పవన్ వర్సస్ అంబటి.. నిరూపిస్తే రాజీనామా చేస్తా !

- Advertisement -

గత కొన్ని రోజులుగా జనసేన వైసీపీ మద్య రాజకీయ రగడ ఏ స్థాయిలో కొనసాగుతోందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆ మద్య విశాఖలో జరిగిన పరిణామాల తరువాత ఈ రెండు పార్టీల మద్య వైరం తారస్థాయికి చేరుతోంది. పవన్ టార్గెట్ గా వైసీపీ నేతలు సెటైరికల్ విమర్శలు చేయడం.. వాటికి అంతే స్థాయిలో జనసేన నుంచి ప్రతి విమర్శలు చేస్తుండడంతో.. ప్రస్తుతం పవన్ వర్సస్ వైసీపీ రగడ హాట్ టాపిక్ గా నిలుస్తోంది. గతంలో జనసేనాను లైట్ తీసుకున్న వైసీపీ.. ఇప్పుడు జనసేన దూకుడు అడ్డుకట్ట వేసేందుకు విశ్వ ప్రయత్నలే చేస్తోంది. తరచూ పవన్ టార్గెట్ గా వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు చేస్తుంటే.. జనసేననే ప్రధాన ప్రత్యర్థిగా వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇటీవల పవన్ ప్రచార రథం వారాహి పై ఇరు పార్టీల మద్య రాజకీయ వైరం ఏ స్థాయిలో జరిగిందో అందరం చూశాం. ఇక తాజాగా సత్తెనపల్లి పర్యటనలో భాగంగా పవన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి ఇరు పార్టీల మద్య అగ్గిని రాజేశాయి. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమని, అది వైసీపీ నేతలకు తెలుసని, పవన్ వ్యాఖ్యానించారు. అందువల్ల వైసీపీ దాడులకు పాల్పడే అవకాశం ఉంది కాబట్టి వ్యూహ రచనను తనకు వదిలేయ్యాలని జనసైనికులకు పవన్ సూచించారు. 151 మంది ఎమ్మేల్యేలు ఉన్న వైసీపీ చిల్లర రాజకీయాలు తప్పా పనికొచ్చే పనులు చేయడం లేదని ఘాటుగా విమర్శించారు.

ఇంకా ఇటీవల హాట్ టాపిక్ గా నిలిచిన పవన్ ప్రచార రథం వారాహి గురించి మాట్లాడుతూ ” ఏపీలో వారాహి తిరుగుతుందనే.. ఎవరు అపుతారో చూస్తా అంటూ సవాల్ విసిరారు. దమ్ముంటే మీ ముఖ్యమంత్రిని రమ్మను.. కూసే వైసీపీ గాడిదలను రమ్మను అంటూ.. ఏపీలో వారాహిని ఆపితే నేనెంటో చూపిస్తా ” అంటూ హెచ్చరించారు పవన్. దీంతో పవన్ చేసిన హాట్ హాట్ సవాళ్ళకు ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ” మేము కాదు గాడిదలం.. బాబు ను మోసే నువ్వే పెద్ద అడ్డగాడిదవి ” అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు అంబటి.. అంతే కాకుండా లబ్దిదారులనుంచి అంబటి లంచం తీసుకున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలకు.. లంచం తీసుకున్నానని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా అంటూ చెప్పుకొచ్చారు. ఇక పోలవరం 2018 లో పూర్తి చేస్తానని చెప్పిన బాబును అప్పుడేందుకు ప్రశ్నించలేదని ఘాటుగా కౌంటర్ వేశారు అంబటి రాంబాబు. మొత్తానికి పవన్ వర్సస్ వైసీపీ నేతల మద్య మాటల తుటాలు రోజురోజుకూ తారస్థాయికి చేరుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి

బీజేపీ మిషన్ 90.. అధికారమే లక్ష్యంగా !

ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్.. ఈసారి వినకపోతే అంతే !

కే‌సి‌ఆర్ జగన్ దోస్తీ.. ఇదే అసలు వ్యూహమా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -