Sunday, May 19, 2024
- Advertisement -

మంచు ల‌క్ష్మితో గొడవకు దిగిన మంచు విష్ణు

- Advertisement -
manchu lakshmi vs manchu vishnu

మంచు ఫ్యామిలీ అంటే క్ర‌మ‌శిక్ష‌ణ‌కు కేరాఫ్ అనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు మంచు ఫ్యామిలీ వార్‌కు రెడీ అయ్యింది. ఈ వార్‌లో మంచు ల‌క్ష్మి వ‌ర్సెస్ మంచు విష్ణు మ‌ధ్య గొడ‌వ‌కు రంగం సిద్ధ‌మైంది. ఇంతకి ఈ అక్కతమ్ముళ్ల మధ్య గొడవ ఏంటో చూద్దాం..  మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన  ‘లక్ష్మి బాంబ్ – ఫ్రమ్ శివకాశి’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని చాలా రోజులు అయినా ఇప్పటి వరకు విడుదల కాలేదు.

ముందుగా ఈ ల‌క్ష్మిబాంబ్‌ను డిసెంబ‌ర్ 23న విడుదల చేయాలనుకున్నారు. అయితే నోట్ల ర‌ద్దు ఎఫెక్ట్‌తో వాయిదా వేశారు. త‌ర్వాత సంక్రాంతి సినిమాలు థియేట‌ర్ల‌ను ఆక్ర‌మించ‌డంతో ఈ సినిమా రిలీజ్‌కు స‌రైన తేదీ దక్కలేదు. మొత్తానికి ఈ సినిమాని ఫిబ్ర‌వ‌రి 3న విడుదల చేయడానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా అదే రోజు ల‌క్ష్మి సోద‌రుడు విష్ణు న‌టించిన ల‌క్కున్నోడు రిలీజ్ అవుతోంది. ఇలా వీరిద్ద‌రు న‌టించిన రెండు చిత్రాలు ఒకే రోజున బాక్సాఫీస్ వ‌ద్ద పోటీకి రెడీ అవుతున్నాయి.

ఈ రెండు సినిమాల్లో విష్ణు సినిమా కామెడీ+యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కింది. ఇక ల‌క్ష్మి న‌టించిన ల‌క్ష్మిబాంబ్‌లో ఆమె జ‌డ్జిగా క‌నిపించ‌నుంది. ఈ రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. మ‌రి ఈ అక్కాత‌మ్ముళ్ల వార్‌లో ఎవ‌రు పైచేయి సాధిస్తారో చూడాలి. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే అదే రోజు నాని న‌టించిన నేను లోక‌ల్ చిత్రం కూడా విడుదల అవుతోంది.

Related

  1. మంచు లక్ష్మికి సీరియస్‌.. ఎవరి మీదనో తెలుస్తే షాక్ అవుతారు!
  2. మోడీ ఎఫెక్ట్ మంచు ఫ్యామిలీపై గ‌ట్టిగానే పడింది!
  3. లైవ్‌లో విష్ణుకు గట్టి వార్నింగ్ ఇచ్చిన మోహ‌న్‌బాబు!
  4. మనోజ్ లవర్ తో విష్ణు రొమాన్స్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -