Monday, May 20, 2024
- Advertisement -

మనోజ్ లవర్ తో విష్ణు రొమాన్స్!

- Advertisement -
vishnu romance with manchu manoj lover

హీరో విష్ణు ఇప్పుడు మంచి జోష్ మీద ఉన్నాడు. గ‌తేడాది ఈడోరకం – ఆడోరకం సినిమాతో మంచి హిట్ తన ఖాతలో వెసుకున్న ఈ హీరో ప్రస్తుతం ‘లక్కున్నోడు’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఫిబ్ర‌వ‌రిలో ఈ ల‌క్కున్నోడు చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఇక ఈ చిత్రం షూటింగ్ అలా పూర్తి అయ్యిందో లేదో విష్ణు వెంట‌నే త‌న కొత్త చిత్రంను మొదలు పెట్టాడు.

ఈ కొత్త సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. కంప్లీట్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో విష్ణు ఇద్ద‌రు హీరోయిన్ల‌తో రొమాన్స్‌కు రెడీ అవుతున్నాడు. ఆ ఇద్దరిలో మెయిన్ హీరోయిన్‌గా మ‌ళ‌యాళ హీరోయిన్ మియా జార్జ్‌ను ఎప్పుడో సెల‌క్ట్ చేశారు.

ఇప్పుడు రెండో హీరోయిన్‌గా విష్ణు త‌మ్ముడు మ‌నోజ్ ఎటాక్‌, నాని జెంటిల్‌మ‌న్ సినిమాల్లో న‌టించిన సుర‌భిని ఎంపిక చేశారు. విష్ణు సోద‌రుడు మ‌నోజ్ – రాంగోపాల్ వ‌ర్మ కాంబోలో వ‌చ్చిన ఎటాక్ సినిమాలో సుర‌భి మ‌నోజ్ ల‌వ‌ర్‌గా న‌టించింది. ఇప్పుడు అదే సుర‌భి విష్ణు ప‌క్క‌న రొమాన్స్‌కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో విష్ణు డిఫరెంట్ లుక్ లో కనిపిస్తుండటంతో అతనికి జోడీగా సురభి అయితే బాగుంటుందని ఆమెను సెలెక్ట్ చేసుకున్నారట దర్శకనిర్మాతలు. ఈ నెల చివరిలో ఈ సినిమా సెట్స్‌మీద‌కు వెళ్లనుంది.

Related

  1. చరణ్ కి అఖిల్ కి మధ్య ఉన్న సంబంధం ఇదే!
  2. హీరోయిన్ ఫోన్ లో అలాంటి వీడియోలా..?
  3. దర్శకుడితో యాంకర్ ఎఫైర్.. అడ్దంగా పట్టుకున్న భార్య!
  4. రష్మీని రేప్ చేయబోయిన కార్ డ్రైవర్! నిజాలు బయట పడ్డాయి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -