Tuesday, April 30, 2024
- Advertisement -

దిల్ రాజు.. నాగార్జున మధ్య గొడవకు కారణం ఏంటి..?

- Advertisement -
nag satire on dil raju

ఇప్పుడు టాలీవుడ్ లో అగ్ర నిర్మాత‌దిల్ రాజుపై కింగ్ నాగార్జున సెటైర్లే వేశాడ‌న్న చర్చలు బాగా వినిపిస్తున్నాయి. ఇంతకి నాగార్జున దిల్ రాజుని ఏమన్నాడు..? వీరి గొడవ వెనక ఉన్న కథ ఏంటో చూద్దాం.. దిల్ రాజు నిర్మించిన శ‌త‌మానం భ‌వ‌తి ఇటీవ‌ల విడుదల అయ్యి మంచి టాక్ తో హిట్ కూడా అయ్యింది. ఈ చిత్రంకు సంబంధించి ప్ర‌మోష‌న్స్‌లో దిల్ రాజు మాట్లాడుతూ నాగచైతన్య, నాగార్జునతో కలిపి ఓ మల్టీస్టారర్ సినిమా తీయబోతున్నట్టు ప్రకటించాడు.

దిల్ రాజు ప్ర‌క‌ట‌న ఇలా ఉంటే నాగార్జున తాజాగా ట్విట్ట‌ర్‌లో స్పందిస్తూ తాను ఇటీవ‌ల ఓ వార్త వింటున్నాను… చ‌దువుతున్నాను.. తాను-చైతు క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ సినిమాలో న‌టిస్తున్నామ‌ట‌… త‌న‌కు కూడా ఇది ఓ వార్త లాంటిదే అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు. నాగార్జున ఈ ట్వీట్ లో దిల్ రాజు పేరు పేరు ఎక్క‌డా చెప్ప‌క‌పోయినా ఆ వ్యాఖ్యలు చేసింది మాత్రం పరోక్షంగా అతడిపైనేనని చెప్పుకొంటున్నారు. నిజానికి ఇంతకుముందు కూడా దిల్ రాజుపై ఇలాగే నాగ్ స్పందించాడన్న రూమర్లున్నాయి.

గతంలో దిల్ రాజు వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ర‌వితేజ హీరోగా ఓ చిత్రం చేయాలనుకున్నాడు. అయితే తర్వాత అదే స్టోరీతో నాగార్జున‌తో సినిమా చేయాలనుకున్నాడు. అయితే నాగర్జున ఆ అవకాశం రాజుకు ఇవ్వ‌లేద‌న్న టాక్ ఉంది. ఇక ఇప్పుడు నాగ్ మ‌రోసారి రాజుకు కౌంట‌ర్‌గానే ఈ వ్యాఖ్య‌లు చేశాడ‌న్న చ‌ర్చ‌లు టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి.

Related

  1. అనసూయ, నాగార్జునలకు ఏమైంది..?
  2. అతడితో టూర్ వెళ్లిన నయనతార.. ఈ లవ్ అయినా సక్సెస్ అవుతుందా?!
  3. అన్నయ్యను ఇంటికి వెళ్లిన పవన్.. ఎందుకో తెలుస్తే షాక్ అవుతారు!
  4. నయనతార అందాలు చూస్తే షాక్ కావాల్సిందే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -