Saturday, April 20, 2024
- Advertisement -

అల్లు అర్జున్ కు పోటీగా మంచు మ‌నోజ్ !

- Advertisement -

స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్ర‌స్తుతం తెర‌కెక్కుతున్న సినిమా పుష్ఫ. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు సుకుమార్‌. ఇదివ‌ర‌కే వీరిద్ద‌రి కాంభినేష‌న్‌లో ఆర్య‌, ఆర్యా 2 సినిమాలు వ‌చ్చాయి. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ రాశాయి. ఈ నేప‌థ్యంలోనే ఈ కాంభినేష‌న్‌లో వ‌స్తున్న పుష్ప‌పై అంచ‌నాలు పెరిగాయి.

ఇక ఈ సినిమా షూటింగ్ ష‌ర వేగంగా జ‌రుగుతోంది. ఇప్ప‌టికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుని మూడో షెడ్యూల్‌కు సిద్ధ‌మ‌వుతోంది. అయితే, ఈ సినిమాలో కీల‌క పాత్ర అయిన పోలీసు క్యారెక్ట‌ర్‌లో త‌మిళ హీరో విజ‌య్ న‌టిస్తున్నాడ‌ని టాక్. అయితే, అనుకోని కొన్ని కార‌ణాల కార‌ణంగా ఆయ‌న త‌ప్పుకున్నారు. ఆ త‌ర్వాత ఈ పాత్ర‌లో మాధ‌వ‌న్ న‌టిస్తార‌ని తెలిపారు.

కానీ ప్ర‌స్తుతం ఈ సినిమాలో కీల‌కంగా ఉన్న పోలీసు పాత్ర‌లో మంచు మ‌నోజ్ న‌టిస్తున్నార‌ని టాక్ న‌డుస్తోంది. దీనికి అనుగుణంగా పుష్ప ద‌ర్శ‌కుడు సుకుమార్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది. ఇదే గ‌న‌క నిజ‌మైతే అల్లు అర్జున్ మంచు మ‌నోజ్ నువ్వా నేనా అంటూ ఢీ కొనే స‌న్నివేశాలు అద్భుతంగా ఉండ‌టం ఖాయ‌మ‌ని సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, ఈ పుష్ప సినిమా ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సాగే క‌థ‌.

గుండెల్ని పిండేలా చైతూ సాయిప‌ల్ల‌వి ల‌వ్ స్టోరీ సాంగ్

అఖిల్‌కు పూజా హెగ్దే విసిరిన గులాబి బాణం చూశారా?

ప్రేమికుల రోజు కథేంటో తెలుసా? ఫిబ్ర‌వ‌రి 14 నే ఎందుకు ?

అలాంటి పెళ్లికి ఎవ‌రి అంగీకార‌మూ అక్కర్లేదు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -