Thursday, April 25, 2024
- Advertisement -

పుట్టినరోజు సందర్భంగా 25 వేల కుటుంబాలకు సాయం చేసిన.. మంచు మనోజ్!

- Advertisement -

ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న ఈ క్లిష్ట పరిస్థితుల కారణంగా రోజుకు అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంతోమంది సరైన సమయంలో మౌలిక సదుపాయాలు లభించగా మరణిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో ఎంతో మంది ముందుకు వచ్చి కరోనా బాధితుల కోసం తమ వంతు సాయం చేస్తున్నారు.

తాజాగా టాలీవుడ్ హీరో మంచు మనోజ్ నేడు(మే 20) పుట్టినరోజు కావడంతో, తన పుట్టినరోజు సందర్భంగా మంచు మనోజ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈసంవత్సరం నా పుట్టినరోజు సందర్భంగా కరోనా బాధితుల కుటుంబాలకు తన వంతు సహాయం చేస్తానని ఈ యంగ్ హీరో ప్రకటించారు. ఈ క్రమంలోనే కరోనా నుంచి మన ప్రాణాన్ని కాపాడుతున్నటువంటి ఫ్రంట్లైన్ వారియర్స్ కి మంచు మనోజ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Also read:కరోనా బాధితుల కోసం ముందుకొచ్చిన యాంకర్ వింధ్య.. ఎలా అంటే?

మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు మిత్రులతో కలిసి 25 వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపించి తన వంతు సహాయం చేస్తానని ప్రకటించారు.అదేవిధంగా ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరు సరైన జాగ్రత్తలు పాటిస్తూ,మాస్క్ ధరించాలని మంచు మనోజ్ సూచించారు. నేడు మంచు మనోజ్ పుట్టినరోజు కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Also read:రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టిన కృతి శెట్టి?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -