Thursday, April 18, 2024
- Advertisement -

అదిరిపోయిన కొమరమ్ భీమ్.. న్యూ లుక్!

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు కావడంతో ఎన్టీఆర్ నటిస్తున్నటువంటి “ఆర్ఆర్ఆర్” చిత్రం నుంచి సర్ప్రైజ్ ఉంటుందని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. ఈ క్రమంలోనే”ఆర్ఆర్ఆర్”నుంచి ఎన్టీఆర్ స్పెషల్ లుక్ పోస్టర్ విడుదల చేస్తూ అభిమానుల్లో సందడి రేకెత్తించారు.

నేడు తారక్ పుట్టిన రోజు సందర్భంగా “ఆర్ఆర్ఆర్” నుంచి విడుదలైన పోస్టర్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.ఇందులో జూనియర్ ఎన్టీఆర్ హై వోల్టేజ్ లుక్కులో కనిపించారు. చేతిలో బల్లెం పట్టుకొని ఎంతో ఆగ్రహంతో కనిపిస్తున్నటువంటి ఈ పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన కొమరం భీమ్ టీజర్, పోస్టర్లు, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Also read:కరోనా బాధితుల కోసం ముందుకొచ్చిన యాంకర్ వింధ్య.. ఎలా అంటే?

తాజాగా తారక్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్ సినిమాపై మరింత అంచనాలను పెంచడమే కాకుండా, ఈ సినిమాలో తారక్ పాత్ర ఎలా ఉంటుందనే విషయంపై అభిమానులలో ఎంతో ఆతృత నెలకొంది. ఇకపోతే తాజాగా ఎన్టీఆర్ కరోనా బారిన పడటంతో బర్త్డే వేడుకలకు దూరంగా ఉండాలని ఎన్టీఆర్ తన అభిమానులను కోరడంతో ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన హీరోకి పెద్దఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Also read:రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టిన కృతి శెట్టి?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -