Friday, April 26, 2024
- Advertisement -

బన్నీతో గొడవకు దిగిన గంటా శ్రీనివాసరావు కొడుకు ?

- Advertisement -
Minister Sons Movie Jayadev Release Date

మంత్రి గంటా శ్రీనివాసరావు కొడుకు కి.. అల్లు అర్జున్ కి గొడవ అనే టైటిల్ చూసి కంగరు పడకండి.. వీరి గొడవ పడుతుంది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో. అసలు విషయంలోకి వెళ్తే.. మంత్రి గంటా శ్రీనివాసరావు కొడుకు గంటా రవితేజ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘జయదేవ్’. ఈ మూవీ కంప్లీట్ అయి చాలా కాలమే అవుతుంది.

{loadmodule mod_custom,GA1} 

కానీ విడుదలకు మంచి టైం లోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని జూన్ 30న రిలీజ్ చేయాలని అనుకున్నారు. జూన్ 23న అల్లు అర్జున్ మూవీ ‘దువ్వాడ జగన్నాథం’ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో చాలా చిత్రాలే రిలీజ్ కు రెడీగా ఉన్నప్పటికి.. అందరి చూపు మాత్రం డీజే పైనే ఉంది. దాంతో డీజే కి ముందు కానీ.. వెనక గాని ఏ సినిమా విడుదల ముందుకు రావట్లేదు. ఐతే ‘జయదేవ్’ సినిమాకు మాత్రం ధైర్యంగా రిలీజ్ డేట్ ఇచ్చేశారు. ‘డీజే’కు పాజిటివ్ టాక్ వస్తే సెకండ్ వీకెండ్లో కూడా జోరు కొనసాగడం ఖాయం. మరి ‘జయదేవ్’ ఆ పోటీని ఎలా తట్టుకుంటుందో చూడాలి. ‘జయదేవ్’.. తమిళంలో సూపర్ హిట్టయిన ‘సేతుపతి’ సినిమాకు రీమేక్. తమిళంలో విజయ్ సేతుపతి పోలీస్ క్యారెక్టర్లో అదరగొట్టాడు. నిజానికిది ఒక ఇమేజ్ ఉన్న హీరో చేయాల్సిన సినిమా. కానీ కొత్తవాడైన.. అంతగా ఫేస్ వాల్యూ లేని రవితేజ చేస్తుండటంతో ఆ పాత్రకు అతను ఏమాత్రం సూటవుతాడో అన్న అనుమానాలు ఉన్నాయి.

{loadmodule mod_custom,GA2} 

మరి సీనియర్ దర్శకుడు జయంత్ అతడిని ఎలా ప్రెజెంట్ చేశాడో చూడాలి. జయంత్ చివరగా ‘లక్ష్మీ నరసింహ’తో ఓ మోస్తరు హిట్టు కొట్టాడు. ఆ తర్వాత ఆయన తీసిన సినిమాలన్నీ ఫ్లాపులే. చివరగా ఆయన్నుంచి ‘తీన్ మార్’ అనే ఫ్లాప్ మూవీ వచ్చింది. మరి ‘జయదేవ్’తో తాను హిట్టు కొట్టి మంత్రి కొడుకును కూడా హీరోగా నిలబెడతాడేమో చూడాలి.

{youtube}cg4J4Pqi_UM{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. నా కొడుకుకు తల్లి కాజలే.. నిజం చెప్పిన రానా
  2. గాలి కొడుకు హీరోగా.. దర్శకుడికి ఎన్ని కోట్లో తెలుసా..?
  3. కొడుకు కోసం మాజీ లవర్ ని దింపిన నాగ్..?
  4. రెండో పెల్లికి అడ్డు వ‌స్తున్నాడ‌నే నెపంతో అన్నంలో పురుగుల మందు క‌లిపి కొడుకును చంపిన త‌ల్లి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -