Sunday, May 5, 2024
- Advertisement -

106 వయసులో.. లక్షలు సంపాదిస్తున్న బామ్మ..!

- Advertisement -
106 year old indian youtuber is earning in lakhs with cooking videos

ఈ రోజుల్లో ఒక మనిషి 80ఏళ్లు బ్రతికితే.. గొప్ప అనుకునే పరిస్థితి ఉంది. అయితే మస్తానమ్మ అనే ఆమె అందరిలాంటి వృద్ధురాలు కాదు. ఇప్పుడు ఈమె వయసు 106. ఏపీలోని కృష్ణజిల్లా గుడివాడకి వెళ్లి మస్తానమ్మ అనే పేరు చెబితే చాలు.. ఎవరైన ఆమె ఇంటి దారి చెప్పుతారు. అంతలా ఫేమస్ అయిపోయింది. ఈమె తన సొంత ఊరుల్ఫ్ మాత్రమే ఫేమస్ కాదు.. వరల్డ్ ఫేమస్.

{loadmodule mod_custom,GA1} 

ఈమె అసలు వరల్డ్ ఫేమస్ ఎలా అయింది..? ఈ వయసులో కూడా లక్షలు ఎలా సంపాదిస్తోంది..? ప్రస్తుతం యూట్యూబ్ చాలా మందికి జీవనాధారంగా మారింది. ప్రాంక్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సీరీస్, వంట వీడియోలు, సినిమా రివ్యూలు, వార్తలు, కామెడి షోలు, మొబైల్ మార్కేట్ సమాచారం, చివరకి పాఠాలు కూడా వీడియోలు తీసి యూట్యూబ్ లో పెడుతున్నారు. వీడియో క్లిక్ అయి వైరల్ వెళితే ఇండియా నుంచి ఇటు కెనడా వరకు, అటు ఆస్ట్రేలియా వరకు, ఎవరికి ఆసక్తిగా అనిపిస్తే వారు, ఎవరికి అవసరం ఉంటే వారు చూస్తారు. మిలియన్లు కొద్దీ వ్యూస్ వస్తే లక్షల్లో డబ్బులు చేతికొస్తాయి. ఈ మస్తనమ్మ వంటలు బాగా చేస్తుంది. సహజంగా పొయ్యి మీద, అన్ని సహజమైన వంట సరుకులే వాడుతూ, తెలుగు పల్లే వంటలు రుచికరంగా వండుతుంది. ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో కాని ఆవిడ మనవడు లక్ష్మణ్ కి ఎందుకో ఈవిడ వంట చేసేటప్పుడు వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టాలనే ఆలోచన వచ్చింది.

{loadmodule mod_custom,GA2} 

దాంతో ఆమెకి సమాచారం ఇవ్వకుండానే వంట చేస్తుండగా వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టేసారు. వాళ్ళు ఊహించనట్టుగా ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది. అక్కడినుంచి ఈ కథ స్టార్ట్ అయింది. పుచ్చకాయలో చికెన్, చికెన్ ఫ్రై, గుడ్డుకూర, పాట్ బిర్యాని, కీమా బిర్యాని, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలా ఎన్నోరకాల వంటలు పొయ్యి నీద సహజ పద్ధతుల్లో వండుతూ, వాటిని యూట్యూబ్ లో పెడుతూ పేరుతో పాటు డబ్బు సంపాదిస్తున్నారు బామ్మ – మనవలు. ఇప్పుడు ఈవిడ యూట్యూబ్ ఛానెల్ “country foods” కి మంచి స్పందన వస్తోంది. మన దేశంలోనే కాదు.. మిగిత దేశాల్లో కూడా ఈ బామ్మ వంటలకు మంచి స్పందన వస్తోంది.

{youtube}sduhP8npg6E{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. సుమ వయసులో ఎంతో తెలుసా..? సినిమాలకు ఎందుకు దూరం..?
  2. యాంకర్ శ్రీముఖికి.. ఈ వయసులో అవే చేస్తాదట..!
  3. ప్రగతి, రమ్యకృష్ణ వయసు ఎంతో తెలుసా..?
  4. ఆమె వయసు 70 ఏళ్లు.. అందం 20 ఏళ్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -