Saturday, April 27, 2024
- Advertisement -

చిక్కుల్లో నటి ముంతాజ్

- Advertisement -

వెంకటేశ్ నటించిన గణేశ్ చిత్రంలో.. ప్రత్యేక పాత్ర పోషించిన నటి ముంతాజ్ గుర్తింది కదా. ఖుషీ, ఆగడు, కూలీ లాంటి సినిమాల్లో కూడా నటించింది. కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా చెన్నైలో ఉంటున్న ముంతాజ్ పై తాజాగా గృహ‌ హింస‌ ఆరోపణలు వచ్చాయి.

ఓ మైనర్ బాలిక తమిళనాడులోని అన్నానగర్ పోలీసు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసింది. తనకు సొంతూరుకు వెళ్లనీకుండా ముంతాజ్ హింసిస్తోందంటూ ఫిర్యాదు చేసింది. తనతో బలవంతంగా పని చేయిస్తున్నారంటూ పోలీసులకు తెలిపింది.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ చేసిన బాలికతో పాటు మరో చిన్నారిని ముంతాజ్ ఇంటి నుంచి రక్షించి చెన్నై లోని బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. ఫిర్యాదు చేసిన బాలికది యూపీ. ఆమె వయస్సు 17 ఏళ్లు. ముంతాజ్ ఇంట్లో ఆరేళ్లుగా పని చేస్తోంది. మైనర్లతో పని చేయిస్తున్న ముంతాజ్ పై బాల కార్మిక చట్టం కింద కేసు నమోదు చేశారు.

పవన్ కల్యాణ్ తనయుడి టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ?

మహేశ్ మూవీలో పెళ్లి సందడి బ్యూటీ

సూపర్ హిట్ సినిమాలను జస్ట్ మిస్ చేసుకున్నా హీరోయిన్లు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -