పవన్ కల్యాణ్ తనయుడి టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ?

- Advertisement -

టాలీవుడ్ లో నట వారసుడు అడుగుపెట్టబోతున్నాడంటూ ప్రచారం జోరందుకుంది. అతడు ఎవరో కాదు.. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్. అతడు ఖచ్చితంగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడన్న ఆశతో ఫ్యాన్స్ ఉన్నారు. అయితే అతడికా ఉద్దేశం లేదంటూ పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ గతంలో ఒక సంద్భంలో చెప్పారు. ఇటీవల అకిరా నందన్ బాక్సింగ్ చేస్తున్న వీడియోస్ తెగ వైరల్ అయ్యాయి. దాంతో మళ్లీ అకిరా టాలీవుడ్ ఎంట్రీపై వార్తలు జోరందుకున్నాయి.

లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో ఓ పాత్రలో అకిరా కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ చిన్నప్పటి పాత్రను అకిరా నందన్ చేస్తున్నాడని టాక్. ఈ చిత్రంలో పవన్ గజదొంగగా నటిస్తున్నారు. చిన్నప్పటి ఎపిసోడ్‌ కు ఎక్కువ ప్రాధాన్యం ఉండటంతో అందులో అకిరా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. తన తండ్రితో పాటు ఆ పాత్రకు సంబంధించి అకిరా ప్రాక్టీస్ కూడా చేశాడట.

వన్ నేనొక్కడినే మూవీలో మహేశ్ చిన్నప్పటి పాత్రలో అతడి కుమారుడు గౌతమ్ కృష్ణ నటించాడు. రాజాది గ్రేట్’ లో రవితేజ చిన్నప్పటి పాత్రలో.. అతడి తనయుడు మహాధన్ కనిపించాడు. ఇప్పుడు హరిహర వీరమల్లులో అకిరా నటిస్తాడంటూ ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

ఆర్ఆర్ఆర్ తరహాలో ప్లాన్ చేస్తున్న బన్నీ

విలన్ ను పెళ్లాడబోతున్న హీరోయిన్

చైతూ, సామ్ కలిపేందుకు నందినిరెడ్డి ప్రయత్నాలు..?

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -