మహేశ్ మూవీలో పెళ్లి సందడి బ్యూటీ

సుపర్ స్టార్ మహేశ్ బాబుతో అతడు, ఖలేజా తెరకెక్కించి అభిమానులను అలరించారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. తాజాగా వీరిద్దర కలయికలో మూడో సినిమా తెరకెక్కబోతోంది. ఫిబ్రవరిలో గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ మూవీని SSMB28 గా పిలుచుకుంటున్నారు. ఈ సినిమాకు త్వరలోనే మంచి క్యాచీ టైటిల్ ప్రకటించబోతున్నారట. మహేశ్ తాజా చిత్రం సర్కారు వారి పాట షూటింగ్ కారణంగా ఈ మూవీ పట్టాలెక్కడం కాస్త ఆలస్యమైంది.

ప్రస్తుతం సర్కారు వారి పాట షూటింగ్ పూర్తి అయ్యింది. దాంతో SSMB28 ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి రాబోతోందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్ సరసన పూజా హెగ్డే ను కథానాయికగా ఎంపిక చేశారు. ఇందులో మరో గ్లామరస్ బ్యూటీకి కూడా చోటు కల్పించారు త్రివిక్రమ్. ఈ పాత్ర కోసం పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీలను సంప్రదించినట్లు తెలుస్తోంది. ముందుగా ఈ సినిమాలో నటించేందుకు శ్రీలీల అంత ఆసక్తి చూపించలేదట.

అయితే ఆమె పాత్రనీ, కొన్ని సన్నివేశాలను డైరెక్టర్ వివరించడంతో ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో్ మహేశ్ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నట్లు టాక్. ఆ పాత్ర నెవర్ బిఫోర్ స్థాయిలో ఉండబోతోందని తెలుస్తోంది. మరి నిజంగా ఈ మూవీలో శ్రీలీల నటించబోతోందో లేదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాలి.

క్రేజీ కాంబినేషన్‌లో మరో మల్టీ స్టారర్ మూవీ

పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ కు ఎంత డిమాండ్ చేస్తుందంటే..?

ఐటమ్ సాంగ్ కోసం రష్మిక ఎంత డిమాండ్ చేస్తోందో తెలుసా?

Related Articles

Most Populer

Recent Posts