Tuesday, April 30, 2024
- Advertisement -

జగన్ పార్టీపై బీజేపీ కుట్ర.. కే‌సి‌ఆర్ మాటల్లో నిజమెంత ?

- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ ఈ మద్య తరచూ ఏపీ రాజకీయాలను ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని బీజేపీ కుల్చాలని చూస్తోందని, మోడి ఆదిశగా ప్రయత్నాలు చేస్తున్నారని ఆ మద్య వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యాలే చేశారు. ఇటీవల జరిగిన టి‌ఆర్‌ఎస్ జనరల్ బాడీ సమావేశంలో ఏపీ రాజకీయాలను మరో సారి ప్రస్తావించారు. ఏపీలో జగన్ ఎంతో శ్రమించి సి‌ఎం అయ్యారని, ఆయన ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చేయాని బీజేపీ చూడడం దుర్మార్గమని కే‌సి‌ఆర్ చెప్పుకొచ్చారు. జగన్ పార్టీకి చెందిన 70 మంది ఎమ్మెల్యేలను బీజేపీ లాక్కోవాలని చూస్తోందంటూ కే‌సి‌ఆర్ సంచలన వ్యాఖ్యాలు చేశారు.

జగన్ సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటున్నప్పటికి బీజేపీ మాత్రం ఇలాంటి చర్యలకు పాల్పడేందుకు సిద్దమౌతుండడం దుర్మార్గమని మండి పడ్డారు. వైసీపీని దెబ్బతీసి బీజేపీ బలం పెంచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ ఆరోపించారు. అయితే సి‌ఎం కే‌సి‌ఆర్ చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు వాస్తవం అనే దానిపై రాజకీయ విశ్లేషకులు వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. రాబోయే రోజుల్లో చాలా రాష్ట్రాలలో ఏక్ నాథ్ షిండేలు పుట్టుకొస్తారని, మహారాష్ట్ర మాదిరి రాజకీయాలు చాలా రాష్ట్రాలలో పునరావృతం అవుతాయని కమలనాథులు బహిరంగంగానే వ్యాఖ్యానించిన సందర్బలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీకి ఏమాత్రం బలం లేని ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణపై పట్టు సాధించాలని బీజేపీ అధిష్టానం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంది. ఇప్పటికే తెలంగాణలో కొంతమేర బలం పుంజుకున్న బీజేపీ ఏపీ పై కూడా గట్టిగానే ఫోకస్ చేసే అవకాశాలు మెండుగానే ఉన్నాయి.

బీజేపీ బలం పెంచుకునేందుకు ఎలాంటి ప్రణాళికలు వేయడానికైనా మోడి అమిత్ షా ద్వయం సిద్దంగానే ఉంటుంది. డైరెక్ట్ గా పార్టీకి బలం చేకూరే అవకాశం లేనప్పడు.. పరోక్షంగా ఎదుటి పార్టీలను దెబ్బతీసి బీజేపీని బలపరచడం కమల అధిష్టానానికి కొత్తేమీ కాదు. అందులో భాగంగానే ఇటీవల తెలంగాణలో టి‌ఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు ఎంతటి సంచలనం అయిందో అందరికీ తెలిసిందే. అదే విధంగా ఇప్పుడు ఏపీలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలపై బీజేపీ గురిపెట్టే అవకాశాలు లేకపోలేదు. అందుకే పదే పదే కే‌సి‌ఆర్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అయితే తెలంగాణతో పోలిస్తే ఏపీలోని రాజకీయ పరిస్థితులకు చాలా తేడా ఉంది. ఇక్కడ అధికార వైసీపీ కి బలమైన క్యాడర్ కల్గి ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ పాచికలు ఎంతవరకు ఫలిస్తాయనేది ప్రశ్నార్థకమే.

ఇవి కూడా చదవండి

రేవంత్ రెడ్డిలో మార్పు వస్తోందా.. మునుగోడు ఎఫెక్టేనా ?

ఏపీపై మోడీకి నమ్మకం లేదా..అసలెందుకు ?

బీజేపీకి షాక్ ఇచ్చిన హైకోర్టు..అసలు ఊహించలేదా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -