Friday, May 10, 2024
- Advertisement -

కర్నూల్ పై బాబు ఫోకస్.. వ్యూహం ఫలిస్తుందా ?

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికలే టార్గెట్ గా పావులు కడుపుతున్నరు. ఎలాగైనా రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని దృఢ పట్టుదల చూపిస్తూ నిత్యం ప్రజల్లో ఉండే విధంగా ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. ఎందుకంటే టీడీపీకి వచ్చే ఎన్నికలు జవన్మరణ పోరాటమనే చెప్పాలి. ఫలితం ఏమాత్రం తేడా కొట్టిన పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుంది. అందువల్ల బాబు చతురత కు పని పెడుతూ.. ప్రత్యర్థి పార్టీని దెబ్బతీసే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు. టీడీపీ స్థానాలపై కాకుండా వైసీపీకి బలమైన స్థానాలలో పాగా వేస్తే ప్రత్యర్థి పార్టీపై పైచేయి సాధించడం సులువనే విధంగా ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు.

అందులో భాగంగానే వైసీపీ కంచుకోటగా పేరొందిన కర్నూల్ జిల్లాలో నేడు ( నవంబర్ 16 ) చంద్రబాబు పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో భాగంగా పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు వంటి నియోజిక వర్గాలలో రోడ్ షో నిర్వహించి, ఆ తర్వాత బాదుడే బాదుడు కారక్రమంలో పాల్గొననున్నారు. ఇక అలాగే పార్టీ కార్యకర్తలతో కూడా భేటీ నిర్వహించి జిల్లాలోని పార్టీ స్థితిగతులపై సమీక్షా నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఈ పర్యటనలో చంద్రబాబు ఏ ఏ అంశాల ప్రస్తావన తెరపైకి తెస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే మూడు రాజధానుల్లో భాగంగా కర్నూల్ ను న్యాయ రాజధానిగా చేసేందుకు జగన్ సర్కార్ సిద్దమౌతున్న సంగతి తెలిసిందే.

మూడు రాజధానులపై తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్న బాబు.. మరి కర్నూల్ లో హైకోర్టు నిర్మించడంపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక కర్నూల్ వాసుల్లో మూడు రాజధానుల ప్రస్తావన ఎలగున్నా.. వారి జిల్లాకు హైకోర్టు రావడాన్ని అక్కడి ప్రజలు స్వాగతించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కర్నూల్ జిల్లా ప్రజలను ఆకర్శించేందుకు బాబు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు ? ఏ ఏ అంశాలను తెరపైకి తెస్తారు ? అనేది చూడాలి. ఇక ఉమ్మడి కర్నూల్ జిల్లాలో గత ఎన్నికల్లో 14 అసెంబ్లీ స్థానాలతో పారు రెండు లోక్ సభ స్థానాలను కూడా వైసీపీ కైవసం చేసుకుంది. మరి వైసీపీకి ఇంతటి బలమైన ఉమ్మడి కర్నూల్ జిల్లాలో టీడీపీ ప్రణాళికలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

ఇవి కూడా చదవండి

జగన్ పార్టీ పై బీజేపీ కుట్ర ?

రేవంత్ రెడ్డిలో మార్పు.. మునుగోడు ఎఫెక్ట్ ?

ఈటెల మళ్ళీ టి‌ఆర్‌ఎస్ లోకి.. బిజెపికి గట్టి దెబ్బే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -