Wednesday, April 24, 2024
- Advertisement -

మరోసారి గని వాయిదా… ఆ సినిమా కోసమేనా ?

- Advertisement -

మెగా హీరో వరుణ్ తేజ్ ‘గని’ సినిమా మరోసారి వాయిదా పడింది. వాస్తవానికి ఈ నెల 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ అదే రోజున విడుదలవుతుండటంతో గని వాయిదా పడక తప్పలేదు. భీమ్లా నాయక్ ఎఫెక్ట్తో ఇప్పటికే ఆడవాళ్లు మీకు జోహార్లు, సెబాస్టియన్ చిత్రాలు వాయిదా పడ్డాయి.

ఇప్పుడా వరసలో గని కూడా వచ్చి చేరింది. గని కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం అని ఆ సినిమా మేకర్స్ ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్లాగానే భీమ్లా నాయక్ కోసం తాము ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం.’ అని మేకర్స్ వెల్లడించారు. నిజానికి ఫిబ్రవరి 25 లేదా మార్చి 4న గని విడుదల చేయాలని మేకర్స్ భావించారు. ఇటీవలే ఫిబ్రవరి 25ని రిలీజ్ డేట్గా ఫిక్స్ చేశారు.

అయితే ఇంతలో భీమ్లా నాయక్ సినిమాను కూడా అదే రోజున విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో గని మేకర్స్ డైలామాలో పడ్డారు. భీమ్లా నాయక్తో పోటీపడి రిలీజ్కు వెళ్లడం కంటే.. విడుదలను కాస్త వెనక్కి జరపడమే బెటర్ అని భావించారు. బాక్సింగ్ నేపథ్యంలో దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ సినిమాను తెరకెక్కించారు. వరుణ్ సరసన బాలీవుడ్ నటి సయీ మంజ్రేకర్ సందడి చేయనుంది. సునీల్ శెట్టి, ఉపేంద్ర, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

విజయ్ దేవరకొండ ఎలాంటి వాడు అంటే..

ప్ర‌భుత్వాన్ని ఢీ కొట్ట‌నున్న జూనియ‌ర్ ఎన్‌టీఆర్

రెమ్యూన‌రేష‌న్ భారీగా పెంచేసిన ప్రియామ‌ణి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -