Wednesday, May 15, 2024
- Advertisement -

బాహుబలి గురించి షాకింగ్ సీక్రెట్! వీరికే తెలుసు!

- Advertisement -

బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ సినిమాని మలిచిన తీరు అద్భుతం. అంతే కాదు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు ? అనే ప్రశ్నను వాళ్ల ముందు ఉంచింది. ఈ ప్రశ్నపై చాలామంది చిత్ర బృందాన్ని అడిగిన ఎవరు కూడా సమాధానం చెప్పట్లేదు.

ఈ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది గడుస్తున్నా ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకుందామని ఆతృతగా గూగుల్ ని అడిగే వారి సంఖ్య తగ్గడం లేదు. అయితే ఈ విషయానికి సంబంధించిన ఓ నిజం బయటికి వచ్చింది. అసలు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న విషయం కట్టప్ప రోల్ పోషించిన సత్య రాజ్ కే తెలియదంట. ఇంకా ఆ సన్నివేశం కూడా షూట్ చేయలేదంట. ఈ రహస్యం కథ రచయిత విజయేంద్ర ప్రసాద్, డైరక్టర్ రాజమౌళి, కథానాయకుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి మాత్రమే తెలుసని సమాచారం.

మూడేళ్ల పాటు ఒక సీక్రెట్ ని దాచుకోవడం అంటే చాలా కష్టం. అందుకే ఆ విషయాన్ని జక్కన్న ఎవరికీ చెప్పకుండా దాచి పెట్టాడని చిత్ర యూనిట్ అంటోంది. రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న క్లైమాక్స్ షూట్ లో కట్టప్ప పై ముఖ్యమైన సీన్స్ చిత్రికరిస్తున్నారట. అప్పుడైన బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే విషయంపై క్లారిటీ వస్తుందో లేదో చూడాలి.

Related

  1. బాహుబలి లో ఎన్టీఆర్ పాట పాడనున్నాడా?
  2. బాహుబలి కంటే పెళ్లి చూపులు గొప్ప చిత్రం
  3. బాహుబలి రికార్డులను బ‌ద్ద‌లు కొట్టింది
  4. సైమా లో బాహుబలి – మహేష్ బాబు ఆధిపత్యం ..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -