Thursday, May 16, 2024
- Advertisement -

సైమా లో బాహుబలి – మహేష్ బాబు ఆధిపత్యం ..

- Advertisement -

నిన్న సింగపూర్ లో అట్టహాసం గా జరిగిన సైమా 2016 ప్రోగ్రాం మంచి ఫేం ని సంపాదించుకుంది. అతిరధ మహారధుల సమక్షం లో జరిగిన ఈ కార్యక్రమానికి చిరంజీవి ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు. తొలి రోజు తెలుగు వారు అందరూ కలిసి దిగిన సేల్ఫీ అతిపెద్ద పాయింట్ గా నిలిచింది. రానా తీసిన ఈ సెల్ఫీ ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది.

చిరంజీవి 150 సినిమా విషయం లో అందరూ ఆయన కి శుభాకాంక్షలు చెబుతూ ఆహ్లాదంగా గడిపారు. జూన్ 30 , జూలై 1 , జూలై 2 మూడు రోజుల పాటు జరగబోతున్న ఈ సైమా వేడుకలకి సింగపూర్ ముస్తాబు అయ్యింది. మొదటి రోజున తెలుగు , కన్నడ సినిమా పరిశ్రమల వారికి అవార్డులు అందించారు. టాలీవుడ్ లో బాహుబలి, శ్రీమంతుడు సినిమాలు అధిక అవార్డులు గెలుచుకున్నాయి.

ఉత్తమ చిత్రం- బాహుబలి

ఉత్తమ నటుడు- మహేష్ బాబు(శ్రీమంతుడు)

ఉత్తమ నటి- శృతి హాసన్(శ్రీమంతుడు)

ఉత్తమ దర్శకుడు- రాజమౌళి(బాహుబలి)

ఉత్తమ నటుడు (క్రిటిక్)- అల్లు అర్జున్(రుద్రమదేవి)

ఉత్తమ నటి(క్రిటిక్)- అనుష్క(రుద్రమదేవి)

యూత్ ఐకాన్ ఆఫ్ సౌత్ ఇండియా- సమంత

ఉత్తమ సహాయ నటుడు- రాజేంద్ర ప్రసాద్(శ్రీమంతుడు)

ఉత్తమ సహాయ నటి- రమ్యకృష్ణ(బాహుబలి)

ఉత్తమ విలన్- దగ్గుబాటి రానా(బాహుబలి)

ఉత్తమ కమెడియన్- వెన్నెల కిషోర్(భలేభలే మగాడివోయ్)

ఉత్తమ నూతన దర్శకుడు- అనిల్ రావిపూడి(పటాస్)

ఉత్తమ నూతన నటుడు- అక్కినేని అఖిల్(అఖిల్)

ఉత్తమ నూతన నిర్మాత- విజయ్ రెడ్డి మరియు శశిదేవ్ రెడ్డి(భలే మంచి రోజు)

ఉత్తమ సంగీత దర్శకుడు- దేవిశ్రీ ప్రసాద్(శ్రీమంతుడు)

ఉత్తమ కొరియోగ్రాఫర్- జానీ(టెంపర్)

ఉత్తమ నూతన నటి- ప్రగ్యా జైస్వాల్(కంచె)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్- సెంథిల్ కుమార్(బాహుబలి)

ఉత్తమ గేయ రచయిత- సిరివెన్నెల సీతారామ శాస్త్రి(కంచె)

ఉత్తమ గాయకుడు- సాగర్ (జత కలిసే- శ్రీమంతుడు)

ఉత్తమ గాయని- సత్య యామిని(మమతల తల్లి- బాహుబలి)

జీవిత సాఫల్య పురస్కారం- ఎస్ జానకి

సాంగ్ ఆఫ్ ది ఇయర్- రామ రామ (శ్రీమంతుడు)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -