Monday, April 29, 2024
- Advertisement -

ఆ సినిమాల లిస్టులోకి చేరిపోయిన నాగ చైతన్య.. థాంక్యూ!

- Advertisement -

టాలివుడ్ లో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న నాగచైతన్య వరుసగా మజిలీ, వెంకీ మామ సక్సెస్‌లతో మంచి ఊపు మీదున్నాడు. ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉన్న క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ మూవీ తెలుగు రాష్ట్రాలలో కరోనా ఉదృతి పెరుగుతున్న కారణంగా రిలీజ్‏ను వాయిదా వేస్తున్నట్టుగా దర్శక,నిర్మాతలు ప్రకటించారు.

రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా నాగచైతన్య, రాశీ ఖన్నా హీరో హీరోయిన్లుగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘థాంక్యూ’. శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ హీరోలతో విక్రమ్ కుమార్ రూపొందించిన ‘మనం’ సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతో మరోసారి డైరెక్టర్‌విక్రమ్ కుమార్ నాగచైతన్య కాంబినేషన్ లో సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also read:బన్నీ కథలో ఎన్టీఆర్.. మరోసారి స్టూడెంట్ పాత్రలో!

నాగచైతన్య తాజాగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘థాంక్యూ’ మూవీ ఇటలీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న తరుణంలో భారతదేశంలో ప్రతీ రోజు లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడంతో టాలీవుడ్ లో ఇప్పటికే “ఆచార్య”, ‘ఆర్ఆర్ఆర్’, “సర్కారు వారి పాట” వంటి సినిమాలు వాయిదా పడ్డాయి. అయితే నాగచైతన్య “థ్యాంక్యూ” చిత్రం మాత్రం కరోనా నిబంధనలను పాటిస్తూ ఇటలీలో చిత్రీకరణ జరుపుకుంటుంది. అయితే కరోనా కేసులు అధికమవడంతో నాగ చైతన్య థాంక్యూ మూవీ కూడా షూటింగ్ వాయిదా పడింది.

Also read:బాలయ్యతో సినిమాకు అనిల్ రావిపూడి ఎన్ని రూ. కోట్లు పెడుతున్నాడో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -