Friday, April 26, 2024
- Advertisement -

చైతూ ‘లవ్ స్టోరీ’ తో వచ్చేస్తున్నాడు.. విడుదల ఎప్పుడంటే..!

- Advertisement -

నేచురల్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల- నాగచైతన్య కాంబినేషన్ లో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమా షూటింగ్ కొన్ని నెలల కిందటే పూర్తయింది. అయితే కరోనా వ్యాప్తి కారణంగా థియేటర్లు మూతపడడంతో ఈ సినిమా విడుదల ఆగిపోయింది. థియేటర్లు తెరుచుకోవడంతో పాటు రోజుకు నాలుగు షోలు వేసినప్పుడే తమ సినిమాను విడుదల చేస్తామని ఇప్పటికే లవ్ స్టోరీ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాగా కొద్ది రోజుల కిందట తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ప్రారంభం కాగా కొద్దిరోజుల పాటు థియేటర్లలో అడుగుపెట్టేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపలేదు. కాగా వారం కిందట ఎస్ ఆర్ కళ్యాణమండపం అనే సినిమా విడుదల కాగా దీనికి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే కలెక్షన్స్ మాత్రం భారీగా వస్తుండడంతో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలన్నీ థియేటర్లకు క్యూ కడుతున్నాయి.

ఈ నేపథ్యంలో లవ్ స్టోరీ సినిమా ను కూడా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. వచ్చే నెల 10వ తేదీన వినాయక చవితి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాలోని సారంగదరియా పాట ఇప్పటికే జనాలకు ఎంతగానో నచ్చింది. దీంతో ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Also Read

ఓ రేంజ్ లో బీమ్లా నాయక్ ఎలివేషన్స్

సుకుమార్, మహేష్ మధ్యే మనస్పర్థలు తొలగినట్టేనా..!

సినిమాల్లో కొనసాగింపుపై కాజల్ సంచలన ప్రకటన..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -