బీమ్లా నాయక్ ఎలివేషన్స్ ఓ రేంజ్ లో.. గబ్బర్ సింగ్ కు ఏ మాత్రం తగ్గేదేలా..!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంటుందో తెలిసిందే. ఇటీవల పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కథారచయిత విజయేంద్రప్రసాద్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. పవన్ సినిమాకి ప్రత్యేకంగా కథ అవసరం లేదని, ఫ్యాన్స్ కు నచ్చేలా ఫైట్స్,పాటలు ఉంటే చాలని బొమ్మ హిట్ అవుతుందని అన్నారు.

ఆయన చెప్పింది నిజమే. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఖుషీ,గబ్బర్ సింగ్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్టయిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమాల్లో పెద్దగా కథ ఉండదు. కానీ పవన్ స్టైల్, యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం భారీ రేంజ్ లో ఉంటాయి. గబ్బర్ సింగ్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ తో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చేయించాడు. ఈ సినిమాలో హీరో ఎలివేషన్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇది అభిమానులకు బాగా నచ్చింది.

- Advertisement -

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రానాతో కలిసి అయ్యప్పనుమ్ కోషియమ్ అనే మలయాళ రీమేక్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ మరోసారి పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు దర్శకుడు సాగర్ చంద్ర అయినప్పటికీ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కథ,స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. గబ్బర్ సింగ్ సినిమాలో లాగే ఈ సినిమాలో కూడా హీరో ఎలివేషన్స్ ఓ రేంజ్లో ఉంటాయని సమాచారం.

ఇటీవల హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో పవన్ పై పలు యాక్షన్ సీక్వెన్స్ లు తెరకెక్కించారు. అవన్నీ ఓ రేంజ్ లో ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమాలో ఫైట్స్ అన్ని మాస్ ఆడియన్స్ కి ట్రీట్ ఇచ్చే రేంజ్లో ఉంటాయని అంటున్నారు. ఇదే నిజమైతే చాలా ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి హై రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ చూడొచ్చు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

Also Read

నిశ్చితార్థంపై ప్రచారం నిజమే.. నయనతార 

బిగ్ బాస్ లోకి సుడిగాలి సుధీర్..

‘మా’ ఎన్నికలు జరపండి ..

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -