దాక్కో దాక్కో మేక.. పులి వచ్చేసింది..!

- Advertisement -

పుష్ప ది రైజ్ సినిమా నుంచి ఫస్ట్ సింగింగ్ సాంగ్ వచ్చేసింది. తెలుగు, తమిళ,మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఆయా వెర్షన్ లకు సంబంధించి ఈ పాటను కొన్ని నిమిషాల కిందట యూట్యూబ్ లో మేకర్స్ విడుదల చేశారు. ‘దాక్కో దాక్కో మేక పులొచ్చి కొరుకుద్ది పీక ‘ అని సాగే ఈ పాట మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేలా ఉంది. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా శివమ్ హుషారుగా పాడాడు.

ఈ సాంగ్ లోనే సినిమా నేపథ్యం మొత్తాన్ని దర్శకుడు సుకుమార్ చూపించాడు. అడవిలో ఎర్ర కూలీలతో పాటు అల్లు అర్జున్ గొడ్డలి పట్టుకుని తిరగడం, దుంగలను నరికి లారీకి ఎత్తడం, అడవి నుంచి వాటిని తీసుకెళ్లడం వంటివి చూపించారు. ఇక ఈ పాటలో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. లుంగీ కట్టుకొని, మాసిన టీ షర్ట్ ధరించి, గుబురు గడ్డంతో రఫ్ లుక్ లో కనిపించాడు.

ఈ పాట విడుదలై నిమిషాలే అవుతున్నప్పటికీ ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ సాంగ్ హల్చల్ చేస్తోంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ పాటకి లైక్స్ కొడుతున్నారు. షేర్ చేస్తున్నారు. ఇప్పటికే పుష్ప టీజర్ తో యూట్యూబ్ లో రికార్డులు నమోదు చేసిన బన్నీ.. ఫస్ట్ సింగల్ సాంగ్ తో మరెన్ని రికార్డులు సాధిస్తాడో చూడాలి. పాన్ ఇండియా కేటగిరిలో నిర్మితమవుతున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Also Read

నిర్మాతలకు గట్టిగా క్లాస్ పీకిన నయనతార.. ఎందుకంటే..!

సుకుమార్, మహేష్ మధ్యే మనస్పర్థలు తొలగినట్టేనా..!

అభిమానుల గుండెల్లో పిడిబాకు.. సినిమాల్లో కొనసాగింపుపై కాజల్ సంచలన ప్రకటన..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -