Thursday, April 25, 2024
- Advertisement -

నాగ శౌర్య జెట్ స్పీడ్.. ఒకేసారి ఐదు సినిమాలు లైన్లో..!

- Advertisement -

ఊహలు గుసగుసలాడే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు నాగ శౌర్య. తన తొలి సినిమాతోనే హీరోగా అతడు హిట్ అందుకున్నాడు. చక్కటి రూపం, మంచి అభినయంతో అందరినీ ఆకట్టుకున్నాడు. నాగ శౌర్య కెరీర్ లో పలు సినిమాలు హిట్ అయినప్పటికీ వాటిలో ఛలో మూవీ మాత్రం ప్రత్యేకం. ఆ సినిమా ద్వారా నాగ శౌర్య యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఛలో మూవీ తర్వాత సొంత బేనర్లో వచ్చిన నర్తనశాల, ఆ తర్వాత సాయిపల్లవితో చేసిన కణం అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ నాగ శౌర్య వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ దూసుకుపోతున్నాడు.

మధ్యలో ఓ బేబీ మూవీ నాగ శౌర్యకి మరో హిట్ ఇచ్చింది. ఇందులో సమంత ప్రధాన పాత్ర పోషించినప్పటికీ నాగ శౌర్య కీలక పాత్రలో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం నాగ శౌర్య ఒకేసారి ఐదు సినిమాలను లైన్ లో పెట్టాడు. సొంత బ్యానర్ తో పాటు బయటి బ్యానర్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం నాగ శౌర్య శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్ష్య మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం నాగశౌర్య ఫిట్ గా మారాడు.8 ప్యాక్ సాధించాడు. దీంతోపాటు సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ‘వరుడు కావలెను’ అనే మూవీ లో కూడా నాగ శౌర్య నటిస్తున్నాడు.

ఈస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై రాజేంద్ర దర్శకత్వంలో ‘పోలీసువారి హెచ్చరిక’, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ అనే సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఇక సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై అనిల్ కృష్ణ డైరెక్షన్ లో మరో సినిమా చేసేందుకు నాగశౌర్య ఒప్పుకున్నాడు. ఈ సినిమా అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. నాగ శౌర్య వరుసగా ఐదు సినిమాలు చేస్తూ యూత్ హీరోల్లో అందరికంటే బిజీగా ఉన్నాడు.

Also Read

జీవితకు.. బాలయ్య సపోర్ట్​? మా ఎన్నికలు మరింత హీట్​..!

చిత్రపరిశ్రమలో ఎన్నికల వేడి?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -