Monday, April 29, 2024
- Advertisement -

మజ్జిగా చారు ఇలా చేస్తే ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా?

- Advertisement -

మన ఇంట్లో మజ్జిగ మిగిలిపోయాయని బాధపడుతున్నారా…అయితే మిగిలిపోయిన మజ్జిగ పుల్లగా లేకుండా మజ్జిగతో ఎంతో రుచికరమైన చారు చేస్తే తినడానికి ఎంతో కమ్మగా ఉంటుంది. ఇంకోసారి ఇంట్లో మజ్జిగ మిగిలిపోతే వాటిని పడేయకుండా ఈ విధంగా మజ్జిగ చారు చేసుకొని తింటారు. మరి రుచికరమైన మజ్జిగ చారు ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు
మజ్జిగ అర లీటరు, పచ్చిమిర్చి 5, ఉల్లిపాయ ఒకటి, కరివేపాకు రెమ్మ, కొత్తిమిర, పప్పుల పొడి రెండు టేబుల్ స్పూన్లు, ఆవాలు జీలకర్ర టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె తగినంత, కొత్తిమీర తురుము కొద్దిగా.

తయారీ విధానం:
*ముందుగా కొద్దిగా ఉప్పు వేసుకుని పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకోవాలి. అదేవిధంగా ఉల్లిపాయలను సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి.

*స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో ఐదు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడి అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు రెమ్మ వేయాలి.

Also read:ఒకప్పటి ఫోటో షేర్ చేసిన వర్మ..?

*ఆవాలు చిటపట అనగానే ముందుగా కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎరుపు రాగానే పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలియబెట్టాలి.

*పచ్చిమిర్చి కొద్దిగా మగ్గిన తర్వాత చిటికెడు పసుపు వేసి కలియబెట్టాలి. ఈ మిశ్రమం బాగా మగ్గిన తరువాత ఇందులోకి మజ్జిగను వేసి చిన్న మంటపై రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.

Also read:సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్.. రిలీజ్ అయ్యేది అప్పుడే?

*రెండు నిమిషాల తర్వాత 2 టేబుల్ స్పూన్ల పప్పుల పొడి వేసి కలియబెట్టి స్టౌ ఆఫ్ చేసుకోవాలి. పప్పుల పొడి వేయడం వల్ల చారు చిక్కగా వస్తుంది. ఇందులోకి పైన కొత్తిమీర తురుము కలుపుకుంటే తినడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -