Friday, April 19, 2024
- Advertisement -

నాగ చైతన్య దగ్గర ఖరీదైన బైకులు.. కార్లు ఎన్ని ఉన్నాయో తెలుసా?

- Advertisement -

అక్కినేని నాగార్జున నటవారసునిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నాగ చైతన్య ప్రస్తుతం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.తాజాగా క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన “లవ్ స్టోరీ” మూవీ తెలుగు రాష్ట్రాలలో కరోనా ఉదృతి కారణంగా రిలీజ్‏ను వాయిదా వేస్తున్నట్టుగా దర్శక,నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే.

అక్కినేని నాగ చైతన్య సినిమాల్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తనకిష్టమైన స్పోర్ట్స్‌ బైకులు, స్పోర్ట్స్‌ కార్లపై ఆసక్తితో వాటిని కలెక్షన్‌ చేస్తుంటారు. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన స్పోర్ట్స్‌ బైకులు, స్పోర్ట్స్‌ కార్లు కొనడం వీరి హాబీ.ఈ క్రమంలో నాగ చైతన్య దగ్గర లగ్జరీ బైకులు, కార్ల కలెక్షన్‌ బాగానే ఉంది. మరి అతడి దగ్గరున్న ఆ ఖరీదైన వాహనాలేంటో వాటి ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. నాగచైతన్య దగ్గరున్న ఖరీదైన బైకుల్లోBMWR9Tఇది ఒకటి. 2014లో లాంచ్‌ అయిన ఈ బైక్‌ను19 లక్షలు పెట్టి కొన్నాడట.

Also read:రకుల్ ప్రీత్ వంట.. వీడియో తీసి మరి పరువు తీసిన తమ్ముడు!

నాగచైతన్య దగ్గరున్న Ferrari F 430 కారు ధర 1.75 కోట్లుగా ఉంది. నాగచైతన్యకు అత్యంత ఇష్టమైన MV Agusta F4 26 నుంచి 35 లక్షల మధ్య ఉంటుందట. చాలామంది సెలబ్రిటీలు వాడే మెర్సిడిస్‌ బెంజ్‌ కారు కూడా నాగచైతన్య దగ్గర ఉంది.దీని ఖరీదు సుమారు కోటి రూపాయలు ఉంటుందట. ఇక సినిమాల విషయానికొస్తే నాగచైతన్య తాజాగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘థాంక్యూ’ ఈ సినిమాలో. నాగచైతన్య, రాశీ ఖన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితమే ఇటలీలో ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తిరిగి ఇండియా వచ్చిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఇక్కడ కరోనా ఉన్న నేపథ్యంలో సినిమా షూటింగ్ వాయిదా వేశారు.

Also read:ప్రియదర్శి భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -