Thursday, May 2, 2024
- Advertisement -

సోనూసూద్​ .. మరో సంచలన నిర్ణయం

- Advertisement -

సోనూసూద్​ చేస్తున్న సేవలు చూసి ఆశ్చరపోవడం మినహా ఏమీ చేయలేం. కేవలం సాయం చేసేందుకు పుట్టాడేమో అన్నట్టుగా ఆయన సేవలు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే కరోనా ఫస్ట్​వేవ్​లో తన వంతు సాయం చేసి.. దేశవ్యాప్తంగా ఎంతో మంచిపేరు తెచ్చుకున్నాడు సోనూ. ఇక సెకండ్​వేవ్​లోనూ ఎంతో మందికి ఊపిరి అందించాడు సోనూసూద్​. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఆక్సిజన్​ ప్లాంట్లు ఏర్పాటు చేసి.. కోవిడ్​ బాధితులకు ఆక్సిజన్​ అందిస్తున్నాడు. ఏపీలోని కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశాడు.

ఇక కొన్ని రాష్ట్రాల్లో ఫోన్​ చేసిన వెంటనే ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్లు పంపిస్తున్నాడు. అయితే తాజాగా సోనూసూద్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దేశవ్యాప్తంగా మొత్తం 16 నుంచి 18 రాష్ట్రాల్లో ఆక్సిజన్​ పాంట్లు ఏర్పాటు చేసి.. 1500 నుంచి 2000 బెడ్లు ఉన్న ప్రతి ఆస్పత్రికి ఆక్సిజన్​ ప్లాంట్ల ద్వారా ఆక్సిజన్​ కొరత లేకుండా చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ప్రభుత్వాలు చేయాల్సిన పనిని కూడా చేస్తున్నాడు సోనూసూద్​.

Also Read: కళ్లను మాయ చేసే వీడియో.. ఆకు సీతాకొక చిలుకై ఎగిరిపోయింది..!

‘మూడోవేవ్​, నాలుగో వేవ్ వచ్చే వరకు మనం ఎందుకు ఎదురుచూడాలి. ముందే ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది కదా అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ దేశంలో ఇంకా సాయం కోసం ఎదురుచూసే పేద ప్రజలు చాలా మంది ఉన్నారు. వారికి సేవ చేసేందుకు కొందరు ముందుకు వస్తే బాగుంటుంది. ఇది సేవ కాదు. కేవలం నా బాధ్యతగా భావిస్తున్నాను’ అంటూ సోనూసూద్​ పేర్కొన్నాడు. ఆయన సేవా కార్యక్రమాలు చూసి ప్రజలు ఫిదా అయిపోతున్నారు. ప్రభుత్వాలు కూడా సోనూసూద్​ లా ముందుచూపుతో ఆలోచిస్తే ఎవరికీ ఏ కష్టాలు ఉండవని అంటున్నారు.

Also Read: ఆశ్చర్యం.. చికెన్​ లెగ్​పీస్​ రూ. 73 లక్షలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -