ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరిపై విశాల్ పోలీస్ కంప్లైంట్..!

- Advertisement -

సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ పై తెలుగు, తమిళ భాషల్లో అనేక సూపర్ హిట్ చిత్రాలు ఇచ్చిన నిర్మాత ఆర్.బి.చౌదరి పై కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఈ విషయం ఎప్పుడూ కోలీవుడ్ లో కలకలం రేపుతోంది. 2018 లోఇరుంబుథిరయ్( తెలుగులో అభిమన్యుడు) చిత్ర నిర్మాణం సందర్భంగా విశాల్ తనకి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను పెట్టి ఫైనాన్సియర్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాత అయిన ఆర్.బి.చౌదరి నుంచి కొంతమేర డబ్బు అప్పుగా తీసుకున్నాడు.

ఆ తర్వాత కొద్ది రోజులకు విశాల్ తిరిగి బాకీ చెల్లించేశాడు. విశాల్ తాను తీసుకున్న అప్పు తీర్చినప్పటికీ అప్పు తీసుకునే ముందు ఇచ్చిన చెక్కులు, బాండ్లు ప్రామిసరీ నోట్లు మాత్రం చౌదరి తిరిగి ఇవ్వలేదని సమాచారం. ఈ విషయం గురించి విశాల్ పలుసార్లు ఆర్.బి.చౌదరి వద్ద ప్రస్తావనకు తెచ్చారు.అయినప్పటికీ ఆయన పట్టించుకోలేదు. దీంతో విశాల్ చెన్నై నగర డిప్యూటీ పోలీసు కమిషనర్ ను కలిసి ఆర్.బి.చౌదరి పై ఫిర్యాదు చేశాడు.

- Advertisement -

Also Read:స్టార్ హీరోలూ.. రెమ్యూనరేషన్ కాస్త తగ్గించుకోండి బాబూ..

తాను ఇచ్చిన డాక్యుమెంట్స్ ఎక్కడా అని అడిగితే ఆర్.బి.చౌదరి పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడని, ఇప్పుడేమో డాక్యుమెంట్స్, ఖాళీ చెక్కులు కనిపించడం లేదని చెబుతున్నాడని, అందువల్లే అయనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విశాల్ ట్వీట్ చేశారు. అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించి మంచి పేరు తెచ్చుకున్న ఆర్.బి.చౌదరి పై విశాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

Also Read: మెగాస్టార్ వర్సెస్ రెబల్ స్టార్..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -