Thursday, May 2, 2024
- Advertisement -

130 కోట్ల భారీ బడ్జెట్ తో సీరియల్

- Advertisement -

సినిమా రిచ్‌గా రావాలంటే నిర్మాణ సంస్థ వందల కోట్లు ఖర్చు పెడతాయని తెలిసిందే. కానీ ఓ సిరియల్ తీయడానికి ఏకంగా 150 కోట్లు బడ్జెట్ కేటాయించడం అంటే మామూలు విషయం కాదు. మీరు వింటున్నది నిజమే. హిందీ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న మోస్ట్ పాపులర్​ సీరియల్స్‌​లో ‘నాగిని’ ఒకటి. 2015లో ప్రారంభమైన ఈ సీరియల్​ ఇప్పటివరకు ప్రేక్షకులను ఆకటుకుంటూనే ఉంది. తెలుగులో కూడా ‘నాగిని’ మొదటి రెండు సీజన్​లను ప్రసారం చేశారు.

ఈ సీరియల్‌కు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే లభించింది. ఇప్పుడు తాజాగా ఈ సీరియల్​ ఆరో సీజన్ రాబోతోంది. ఇందులో హిందీ బిగ్​బాస్​ సీజన్​ 15 విన్నర్ తేజస్వీ ప్రకాష్​ ప్రధాన పాత్రలో అలరించనుంది. అయితే నాగిని ఆరో సీజన్ కూడా నిర్మాతలు భారీగా ఖర్చుపెడుతున్నారన్న సమాచారం చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ లైఫ్ నివేదిక ప్రకారం..ఈ సీజన్‌ను రూ. 130 కోట్ల భారీ బడ్జెట్​తో రూపొందించినట్లు సమాచారం. ​

ఒకవేళ ఈ సీజన్​ అంతగా హిట్​ కాకపోతే వచ్చే సంవత్సరం నుంచి ఈ ఫ్రాంచైజీని ఆపేయాలని భావిస్తోంది నిర్మాత ఎక్తా కపూర్​. ఈ భారీ బడ్జెట్​తో ఒక సినిమానే తీయొచ్చని ఎక్తాకు పలువురు చెప్పినా ఆమె​ వినలేదని తెలుస్తోంది. నాగిని 6లో విజువల్ ఎఫెక్ట్స్​ భారీగా ఉంటాయని సమాచారం. ఈ సీజన్ ఫిబ్రవరి 12 నుంచి కలర్స్​ ఛానెల్​లో ప్రతీ శనివారం, ఆదివారం ప్రసారం కానుంది. చూడాలి మరి నాగిని ఆరో సీజన్ ప్రేక్షకులను ఏ మాత్రం అలరిస్తుందో ..!

అనుపమ పరమేశ్వరన్‌ గర్భవతి అయ్యిందా ?

300 కోట్ల క్లబ్‌లో బన్నీ

పాన్ ఇండియా మూవీకి సిద్ధమవుతున్న సూపర్ స్టార్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -