300 కోట్ల క్లబ్‌లో బన్నీ

- Advertisement -

పుష్ప: ది రైజ్… రికార్డుల మీదు రికార్డులు సృష్టిస్తోంది. మొన్నటి వరకు తెలుగు, మలయాళం భాషల్లో అభిమానులు ఉన్న బన్నీకి పుష్పతో ఇప్పుడు ఉత్తరాదిలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. పాన్ ఇండియా హీరోగా నిలబెట్టిన పుష్ప … ఒక్క హిందీలోనే వంద కోట్లు కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించింది. సినిమాకు ముందు నుంచే భారీ హైప్ రావడం అందుకు తగినట్లు సుకుమార్ టేకింగ్​, బన్నీ, రష్మిక మందన్నా నటన, సమంత స్పెషల్​ సాంగ్​ ఈ మూవీ విజయంలో కీలక పాత్ర పోషించాయి.

ఈ సినిమాలో సాంగ్స్ ఓ రేంజ్‌లో హిట్ అయ్యాయి. ఇక బన్నీ మ్యానరిజం ఔరా అనిపించింది. పుష్ప సాంగ్స్​, డైలాగ్స్​, మ్యానరిజంపై వచ్చిన రీల్స్​ సోషల్​ మీడియాలో వైరల్​ కావడంతో సినిమా మరింత పాపులర్​ అయింది. గతేడాది డిసెంబర్​ 17న విడుదలైన ఈ చిత్రం ఇటు దక్షిణాదిలోనూ అటు బాలీవుడ్‌లోనూ భారీ హిట్​ కొట్టింది. కరోనా సమయంలోనూ అత్యధిక కలెక్షన్లతో దూసుకపోయింది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 300 కోట్లు రాబట్టిందని చిత్ర యూనిట్ ప్రకటించింది.

2021లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలవడం మాత్రమే కాదు బన్ని కెరీర్ లో తొలిసారి రూ. 300 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మూవీగా రికార్డుల్లోకి ఎక్కింది పుష్ప. ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా థియేటర్లలో మంచి స్పందన రావడం సినీ విమర్శకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఇది పుష్ప కే సాధ్యమంటూ బాలీవుడ్​ క్రిటిక్​ తరుణ్​ ఆదర్శ్​ ఇటీవల ట్వీట్​ చేశారంటే పుష్ప ఎంతలా ఆకట్టుకుంటుందో అర్థమవుతుంది. పుష్ప- ది రైజ్ సూపర్ హిట్ కావడంతో ఇక పుష్ప పార్ట్ టూ ఎలా ఉండబోతోందన్న అంచనాలు ఇప్పటినుంచే వ్యక్తమవుతున్నాయి.

తెర‌పై రీఎంట్రీ ఇస్తున్న ప‌వ‌ర్ స్టార్ మాజీ భార్య‌

రాజ‌శేఖ‌ర్ ను సినిమా నుంచి ఎందుకు త‌ప్పించారు ?

సినీ అభిమానుల‌కు గుడ్ న్యూస్

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -