Friday, April 26, 2024
- Advertisement -

విజయ్ దేవరకొండ సినిమాకు దర్శకుడు ఆయనేనా ?

- Advertisement -

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తెరెక్కిస్తున్న లైగర్ సినిమాతో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత విజయ్ ఎవరితో సినిమా చేయబోతున్నాడన్నది మూవీ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ‘నిన్నుకోరి’, ‘మజిలీ’, ‘టక్ జగదీష్’ చిత్రాలతో దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న శివ నిర్వాణ – విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ప్రాజెక్ట్ ఉందని గత ఏడాదే ప్రకటన వచ్చింది.

అయితే, కరోనా కారణంగా ఈ ప్రాజెక్ట్ డిలే అయింది. దాంతో వీరి కాంబోలో సినిమా క్యాన్సిల్ అయిందనే ప్రచారం జరుగుతోంది. అయితే ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తోంది. ‘లైగర్’ పూర్తి చేసిన విజయ్ నెక్స్ట్ సినిమాను శివ నిర్వాణతోనే చేయనున్నారని తాజా సమాచారం. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడనుందట.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవర కొండ – అనన్య పాండే జంటగా రూపొందుతున్న ‘లైగర్’ ఈ ఏడాది ఆగస్టు 25న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో పాన్ ఇండియా సినిమాగా 5 భాషలలో విడుదల కాబోతుంది. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన లైగర్ గ్లింప్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

జోరుమీదున్న రంగ‌మ్మ‌త్త‌

తెర‌పై రీఎంట్రీ ఇస్తున్న ప‌వ‌ర్ స్టార్ మాజీ భార్య‌

రాజ‌శేఖ‌ర్ ను సినిమా నుంచి ఎందుకు త‌ప్పించారు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -