Thursday, May 9, 2024
- Advertisement -

అభిమానులను కన్ఫ్యూజ్ చేసిన నమ్రత.. వైరల్ గా మారిన ఫోటో!

- Advertisement -

నటిగా,సూపర్ స్టార్ మహేష్ బాబు భార్యగా నమ్రతా శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే నమ్రత తన కుటుంబానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఒకవైపు కుటుంబాన్ని,మరో వైపు మహేష్ కు సంబంధించిన విషయాలన్నింటినీ ఎంతో జాగ్రత్తగా చూసుకునే నమ్రత అప్పుడప్పుడు పలు ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకొని అభిమానులను సందడి చేస్తుంటారు.

ఈ క్రమంలోనే నమ్రత సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోను షేర్ చేసి అభిమానులను కన్ఫ్యూజన్లో పడేసారు. ఈ ఫోటో చూసిన నెటిజన్ల అందరూ ఫోటోలో ఉన్నది గౌతమా? లేక మహేష్ బాబునా? అనే సందిగ్ధంలో పడిపోయారు. మహేష్ బాబు కొడుకు గౌతమ్ కూడా ప్రస్తుతం మహేష్ బాబు ఫిట్నెస్ ను పోలి ఉండడంతో అభిమానులు అయోమయానికి గురయ్యారు.

Also read:అరియనా వాట్సాప్ డీపీ, వాల్ పేపర్ చూస్తే.. షాక్ అవ్వాల్సిందే!

నమ్రత షేర్ చేసిన ఫోటోలో కొత్త హెయిర్ స్టైల్ తో పెంపుడు కుక్కను హత్తుకొని ఉన్న ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటో చూసిన అభిమానులు అయోమయానికి గురవుతూ.. ఫోటోలో ఉన్నది ఎవరా? అనే సందేహం వ్యక్తం చేయడంతో నమ్రత ఫోటోలో ఉన్నది మహేష్ బాబు అని ట్యాగ్ చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారీ వారి పాట చిత్రంకోసం ఈ విధంగా తన స్టైల్ ను మార్చినట్టు మనకు తెలిసిందే. ప్రస్తుతం నమ్రత షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read:థ్రిల్లింగ్‌ కథతో చేయడానికి సిద్ధమైన చందమామ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -