Saturday, April 27, 2024
- Advertisement -

విమాన ప్రమాదంలో టార్జాన్‌ నటుడు జో లారా మృతి!

- Advertisement -

అమెరికా టీవీ న‌టుడు జో లారాతో పాటు ఆయ‌న భార్య‌, మొత్తం ఏడు మంది కుటుంబ‌స‌భ్యులు దుర‌దృష్ట‌క‌ర‌రీతిలో విమాన ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. 1980, 1990 ద‌శ‌కంలో అమెరికా టీవీ సిరీస్‌లో ప్ర‌సారం అయ్యిన టార్జ‌న్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న‌ది. ఆ సిరీస్‌ల్లో జో లారా టార్జ‌న్ పాత్ర పోషించాడు. టెనస్సీ విమానాశ్రయం ఫ్లోరిడాకు బయలు దేరిన సెస్సెనా సి 501 విమానం కొంత సేపటికీ దక్షిణ నౌష్వెల్లీకి 19 కిలోమీటర్ల దూరంలోని పెర్సీ ఫీస్ట్‌ సరుస్సులో కూలిందని రూథర్‌ ఫోర్డ్‌ కౌంటీ రెస్క్యూ సిబ్బంది తెలిపారు.

ఈ ప్రమాదంలో అతనితో పాటు జో లారా భార్య, అమెరికన్ రచయిత మరియు డైటీషియన్ గ్వెన్ షాంబ్లిన్ సహా మరో ఐదుగురు ప్రయాణికులు అమెరికా నగరమైన నాష్విల్లె సమీపంలో ఒక సరస్సులో ప్రైవేట్ జెట్ కూలిపోవడంతో మరణించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది ఆపరేషన్ చేసి 5 మంది ఈ ప్రమాదంలో మరణించినట్లు ధృవీకరించారు.

అయితే ప్రమాదానికి కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోంది. ఫెడరేషన్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈ వార్తను ధృవీకరించిన తరువాత జో లారా అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. లారా నటించిన టెలివిజన్ సిరీస్ ‘టార్జాన్: ది ఎపిక్ అడ్వెంచర్స్’ మొత్తం 22 ఎపిసోడ్‌లుగా 1996-2000 మధ్య వచ్చింది. ‘స్టీల్ ఫ్రాంటియర్’, ‘సన్‌సెట్ హీట్’, ‘ఆపరేషన్ డెల్టా ఫోర్స్’, ‘గన్స్మోక్: ది లాస్ట్ అపాచీ’, ‘అమెరికన్ సైబోర్గ్: స్టీల్ వారియర్ ‘,’ ది మాగ్నిఫిసెంట్ సెవెన్ ‘,’ బేవాచ్ ‘,’ ట్రాపికల్ హీట్ ‘ తదితర చిత్రాల్లో లారా నటించాడు.

విరామం నాకు నేనుగా తీసుకున్నదే.. శృతిహాసన్!

తెలంగాణ ఆడబిడ్డలకు అండగా ఉంటా : వైఎస్ షర్మిల

వెబ్ సిరీస్ లలో స్టార్ హీరో.. ఎవరంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -