టీ టీడీపీ అధ్యక్షుడిగా బక్కని నరసింహులు

- Advertisement -

టీటీడీపీ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్​ నేత బక్కని నరసింహులు ఎంపికయ్యారు. ఈ మేరకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. బక్కని నరసింహులు దళిత సామాజికవర్గానికి చెందిన నేత. 1994 నుంచి 99 వరకు ఆయన షాద్​నగర్​ ఎమ్మెల్యేగా పనిచేశారు. అనంతరం మహబూబ్​నగర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఇటీవల టీటీడీపీ అధ్యక్షుడు ఎల్​.రమణ ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన అనంతరం టీఆర్​ఎస్​లో చేరారు. దీంతో చంద్రబాబు బక్కని నరసింహులును పార్టీ అధ్యక్షుడిగా నియమించారు.

ఈ పదవి కోసం నన్నూరి నర్సిరెడ్డి, రావుల చంద్రశేఖర్​రెడ్డి, కొత్తకోట దయాకర్​రెడ్డి తదితరులను సంప్రదించారు. చివరకు సామాజిక సమీకరణాల దృష్ట్యా బక్కని నరసింహులుకు అవకాశం దక్కింది. బక్కని మొదటి నుంచి చంద్రబాబుకు నమ్మిన బంటుగా కొనసాగుతున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలహీనం అయిన తర్వాత .. ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు పార్టీని వీడారు. కానీ బక్కని నరసింహులు చంద్రబాబునే నమ్ముకొని ఉన్నారు. దీంతో ఆయనకు ఈ పదవి దక్కింది.

- Advertisement -

Also Read: వైఎస్ షర్మిల ఎవ్వరో వదిలిన బాణం కాదు… అన్న వదిలిన బాణమే..!

ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ పరిస్థితి దయనీయంగా ఉంది. ఆ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలుపొందినప్పటికీ ఆ తర్వాత వారు టీఆర్​ఎస్​లో చేరారు. ఇక ఒకరిద్దరు మినహా చెప్పుకోదగ్గ నేతలు కూడా ఆ పార్టీలో లేరు. ఈ పరిస్థితుల్లో బక్కని పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం గమనార్హం.

Also Read: ‘భయం’ తెలియని వ్యక్తులే కాంగ్రెస్​కు కావాలి..! రాహుల్ గాంధీ..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -