ఈ రోజు సోషల్ మీడియాలో హ్యాపి బర్త్ డే నానా అంటూ.. నందమూరి కళ్యాణ్ రామ్ ఫోస్ట్ చేసిన పోటో హాట్ టాపిక్ గా మారింది. గతంలో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ మధ్య పెద్దగా సాన్నిహిత్యం కనిపించకపోయిన.. జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ ల మధ్య దూరం పెరిగిన నాటి నుండి కళ్యాణ్ రామ్ జూనియర్ ల మధ్య సాన్నిహిత్యం విపరీతంగా పెరిగి పోయింది. కళ్యాణ్ రామ్ జూనియర్ ను ‘నానా’ అని ముద్దుగా పిలుచుకుంటాడు.
ఎన్టీఆర్ కు ఏ సమస్య వచ్చినా సలహాలు ఇవ్వడమే కాకుండా మారిపోయిన రాజకీయ సమీకరణాల పరిస్థుతులలో తండ్రి హరికృష్ణకు మానసికంగా ఎంతో మద్దతు ఇవ్వడమే కాకుండా హీరోగా నిర్మాతగా సెటిల్ కావడానికి కళ్యాణ్ రామ్ ఎంతగానో కష్టపడుతున్నాడు. కళ్యాణ్ రామ్ పడుతున్న కష్టాలకు అన్ని విధాల సపోర్ట్ ఇస్తూ జూనియర్ కళ్యాణ్ రామ్ ను ఆర్ధిక సమస్యల నుండి రక్షించడానికి ప్రస్తుతం కళ్యాణ్ సొంత బ్యానర్ లో ‘జై లవ కుశ’ చేస్తున్న విషయం తెలిసిందే.
{loadmodule mod_custom,Side Ad 1}
ఈసినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకుండానే కళ్యాణ్ రామ్ కు ఈ సినిమా చేస్తున్న బిజినెస్ వల్ల 20 కోట్ల లాభం వచ్చింది అన్న వార్తలు కూడా ఉన్నాయి. జూనియర్ పై కళ్యాణ్ రామ్ తన అనిర్వచనీయమైన ప్రేమను వ్యక్త పరుస్తూ ‘హ్యాపీ బర్త్ డే నానా’ అంటూ ఫోటో పెట్టి ట్వీట్ పెట్టాడు. చిన్న వయసులోనే బాల నటుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి స్వర్గీయ నందమూరి తారకరామారావు మనవడిగా, తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్రను వేసుకున్నాడు జూనియర్.
{loadmodule mod_sp_social,Follow Us}
Related